
అశ్విన్ దౌడియా, హత్యకు గురైన కిరణ్ దౌడియా
లండన్, బ్రిటన్ : మాజీ భార్యను అతి కిరాతకంగా చంపిన కేసులో భారత సంతతికి చెందిన అశ్విన్ దౌడియా(51)కి శుక్రవారం లండన్ కోర్టు 18 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. కేసు విచారణలో భాగంగా న్యాయమూర్తి నేరం చేశారా? అని అశ్విన్‌ను ప్రశ్నించగా.. తాను కావాలని చంపలేదని సమాధానమిచ్చారు.
2014లో అశ్విన్ - కిరణ్‌లు విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. విడాకులు తీసుకున్నా ఇరువురూ లీచెస్టర్‌లోని ఇంట్లోనే వేర్వేరుగా నివసిస్తున్నారు. 2017లో కిరణ్ దౌడియా(46) ఆన్‌లైన్ డేటింగ్ సైట్‌లో వివరాలను పొందుపర్చారు. ఈ విషయంపై అశ్విన్ - కిరణ్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పట్టలేని కోపం తెచ్చుకున్న అశ్విన్ చేత్తో కిరణ్ గొంతును గట్టిగా పట్టుకుని మెడను విరిచేశారు.
దాంతో అక్కడికక్కడే కుప్పకూలిన ఆమె ప్రాణాలు విడిచారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కిరణ్ మృతదేహాన్ని ముక్కలుగా నరికిన అశ్విన్ సూట్‌కేసులో పెట్టి లోయలో పడేశారు. ఇద్దరు పిల్లలతో పాటు పోలీసులకు ఆఫీసుకు వెళ్లిన కిరణ్ ఇంటికి తిరిగిరాలేదని చెప్పాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజిలో అశ్విన్ సూట్‌కేసును ఎక్కడికో తీసుకెళ్లడం గమనించారు. అది అనుమానస్పదంగా కనిపించడంతో అశ్విన్‌ను విచారించారు. దీంతో అతను పోలీసుల ముందు నిజం ఒప్పుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment