Kiran Daudia
-
ముక్కలుగా నరికి.. సూట్‌కేసులో పెట్టి..
లండన్, బ్రిటన్ : మాజీ భార్యను అతి కిరాతకంగా చంపిన కేసులో భారత సంతతికి చెందిన అశ్విన్ దౌడియా(51)కి శుక్రవారం లండన్ కోర్టు 18 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. కేసు విచారణలో భాగంగా న్యాయమూర్తి నేరం చేశారా? అని అశ్విన్‌ను ప్రశ్నించగా.. తాను కావాలని చంపలేదని సమాధానమిచ్చారు. 2014లో అశ్విన్ - కిరణ్‌లు విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. విడాకులు తీసుకున్నా ఇరువురూ లీచెస్టర్‌లోని ఇంట్లోనే వేర్వేరుగా నివసిస్తున్నారు. 2017లో కిరణ్ దౌడియా(46) ఆన్లైన్ డేటింగ్ సైట్లో వివరాలను పొందుపర్చారు. ఈ విషయంపై అశ్విన్ - కిరణ్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పట్టలేని కోపం తెచ్చుకున్న అశ్విన్ చేత్తో కిరణ్ గొంతును గట్టిగా పట్టుకుని మెడను విరిచేశారు. దాంతో అక్కడికక్కడే కుప్పకూలిన ఆమె ప్రాణాలు విడిచారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కిరణ్ మృతదేహాన్ని ముక్కలుగా నరికిన అశ్విన్ సూట్‌కేసులో పెట్టి లోయలో పడేశారు. ఇద్దరు పిల్లలతో పాటు పోలీసులకు ఆఫీసుకు వెళ్లిన కిరణ్ ఇంటికి తిరిగిరాలేదని చెప్పాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజిలో అశ్విన్ సూట్‌కేసును ఎక్కడికో తీసుకెళ్లడం గమనించారు. అది అనుమానస్పదంగా కనిపించడంతో అశ్విన్‌ను విచారించారు. దీంతో అతను పోలీసుల ముందు నిజం ఒప్పుకున్నాడు. -
చంపేసి.. సూట్‌కేసులో సర్దేసి..
లండన్: భారత సంతతికి చెందిన ఓ మహిళను చంపి సూట్‌కేసులో పెట్టి చెత్తకుప్పలో పడేశారు. ఈ ఘటన యూకేలోని లీచెస్టర్ లో మంగళవారం వెలుగులోకి వచ్చింది. నగరంలోని క్రోమర్ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి చెత్తకుప్పలో పడేసిన సూట్‌కేసును గమనించాడు. అనుమానస్పదంగా కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్ధలానికి చేరుకున్న పోలీసులు సూట్‌కేసును తెరిచి చూడగా అందులో మహిళ శవం కనిపించింది. ఎవరో హత్య చేసి శవాన్ని సూట్‌కేసులో పెట్టారని నిర్ధారణకు వచ్చిన పోలీసులు కిరణ్ దౌడియా(46)గా గుర్తించారు. ఆమె భర్త అశ్విన్ దౌడియాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కిరణ్ దౌడియా గత 17 సంవత్సరాలుగా నెక్ట్స్ కాల్ సెంటర్లో పని చేస్తున్నారు. కిరణ్-అశ్విన్ లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
భారత మహిళ యూకేలో దారుణహత్య
లండన్: భారత సంతతికి చెందిన ఓ మహిళ యూకేలో దారుణహత్యకు గురైంది. కిరణ్ దాడియా(46) అనే మహిళను హత్యచేసి సూట్‌కేసులో మృతదేహాన్ని ఉంచి లీసెస్టర్ లోని క్రొమర్ స్ట్రీట్‌లో వదిలివెళ్లారు. సూట్‌కేసును గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. లీసెస్టర్‌షైర్ పోలీసులు అక్కడకి చేరుకుని సూట్‌కేసు తెరచిచూడగా రక్తపు మరకలతో ఉన్న కిరణ్ దాడియా మృతదేహాన్ని గుర్తించారు. భారత సంతతికి చెందిన ఈ మహిళ గత 17 ఏళ్ల నుంచి ఓ కాల్ సెంటర్లో జాబ్ చేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆఫీసుకు వెళ్లిన ఆమె కనిపించడం లేదని కిరణ్ సోదరి జస్బీర్ కౌర్ పోలీసులకు తెలిపారు. చివరగా జాబ్ వెళ్లే ముందు తన సోదరితో ఫోన్లో మాట్లాడినట్లు వివరించింది. కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గురైన మహిళ భర్త అశ్విన్ దాడియా(50)ని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. అదే ఏరియాలో ఇటీవల తప్పిపోయిన బ్రిటన్ మహిళ మృతదేహమని మొదట తాము భావించామని స్థానికులు చెప్పారు. ఆధారాలను సేకరించిన క్లూస్ టీమ్ దర్యాప్తు జరుపుతోంది. కిరణ్ భర్త అశ్విన్‌ను కోర్టుకు తీసుకెళ్లనున్నట్లు పోలీసులు చెప్పారు. విచారణ ఇంకా కొనసాగుతోందని, త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. తన సోదరి మృతదేహాన్ని చూసిన తన పిల్లలు ఎంతో భయపడ్డారని, అందులోనూ ఇంటికి వచ్చి పోలీసులు విచారణ చేయడం ఇందుకు మరో కారణమని జస్బీర్ కౌర్ చెప్పారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారని, సీసీటీవీ ఫుటేజీని సేకరించిన పోలీసులు నిందితులను త్వరలోనే పట్టుకుని వారిని శిక్షించాలన్నారు. అమ్మ అందరితోనే కలిసిపోయే వ్యక్తి అని ఆమె హత్యకు గురయ్యారన్న నిజాన్ని నమ్మలేకపోతున్నామని కిరణ్ దాడియా ఇద్దరు కుమారులు పోలీసుల విచారణలో తెలిపారు.