చంపేసి.. సూట్‌కేసులో సర్దేసి.. | Indian-Origin Woman's Body Found Hidden In Suitcase In UK | Sakshi
Sakshi News home page

చంపేసి.. సూట్‌కేసులో సర్దేసి..

Published Thu, Jan 19 2017 5:21 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 AM

Indian-Origin Woman's Body Found Hidden In Suitcase In UK

లండన్‌: భారత​ సంతతికి చెందిన ఓ మహిళను చంపి సూట్‌కేసులో పెట్టి చెత్తకుప్పలో పడేశారు. ఈ ఘటన యూకేలోని లీచెస్టర్‌ లో మంగళవారం వెలుగులోకి వచ్చింది. నగరంలోని క్రోమర్‌ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి చెత్తకుప్పలో పడేసిన సూట్‌కేసును గమనించాడు. అనుమానస్పదంగా కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించాడు. 
 
ఘటనాస్ధలానికి చేరుకున్న పోలీసులు సూట్‌కేసును తెరిచి చూడగా అందులో మహిళ శవం కనిపించింది. ఎవరో హత్య చేసి శవాన్ని సూట్‌కేసులో పెట్టారని నిర్ధారణకు వచ్చిన పోలీసులు కిరణ్‌ దౌడియా(46)గా గుర్తించారు. ఆమె భర్త అశ్విన్‌ దౌడియాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కిరణ్‌ దౌడియా గత 17 సంవత్సరాలుగా నెక్ట్స్‌ కాల్‌ సెంటర్‌లో పని చేస్తున్నారు. కిరణ్‌-అశ్విన్‌ లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement