తిరుపతి: తిరుమలలో అమానుష ఘటన శనివారం చోటుచేసుకుంది. ఏడు రోజుల వయసున్న శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. శ్రీవారి ఆలయం ముందున్న కల్యాణకట్ట వద్ద శిశువు ఏడుస్తూ కనిపించడంతో అటుగా వెళ్తున్న భక్తులు, విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన సిబ్బంది స్థానికంగా ఉన్న అశ్విని ఆసుపత్రిలో శిశువును చేర్చారు. ఈ ఘటనపై విజిలెన్స్ సిబ్బంది, పోలీసులు విచారణ చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజీల ద్వారా శిశువును ఎవరు వదిలి వెళ్లారని గుర్తించేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment