కులాంతర వివాహం.. వరుడి ఇల్లు ధ్వంసం | Inter Caste marriage Bride Relatives Collpased Groom House Karnataka | Sakshi
Sakshi News home page

కులాంతర వివాహం

Published Sat, Sep 8 2018 11:32 AM | Last Updated on Sat, Sep 8 2018 11:32 AM

Inter Caste marriage Bride Relatives Collpased Groom House Karnataka - Sakshi

ధ్వంసమైన వరుడి నివాసం , శశికుమార్, రమ్య పెళ్లినాటి ఫొటో

కర్ణాటక,మాలూరు: యువతీ యువకుడు కులాంతర వివాహం చేసుకోగా వధువు తల్లిదండ్రులు వరుడి ఇంటిని ధ్వంసం చేశారు. ఈఘటన గురువారం రాత్రి తాలూకాలోని హురళగెరె గ్రామంలో చోటు చేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన శశికుమార్‌(25 డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదే క్రమంలో ఇదే గ్రామానికి చెందిన రమ్య (21)తో పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరు కులాలు వేరు కావడంతో వారి పెళ్లికి తల్లిదండ్రులు వ్యతిరేకించారు. దీంతో ప్రేమికులు ఇతర ప్రాంతానికి వెళ్లి వివాహం చేసుకొని గ్రామానికి వచ్చారు.  కోపోద్రిక్తులైన రమ్య పోషకులు  రాత్రి 11 గంటల సమయంలో శశికుమార్‌ ఇంటిపై దాడి చేశారు.  శశికుమార్‌ను చితకబాది ఇంటిని ధ్వంసం చేశా రు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు  రమ్య తల్లిదండ్రులను అదుపులోకి  తీసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement