
సాక్షి, కృష్ణా: ఉయ్యూరు మండలంలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా కలకం సృష్టించింది. మంగళవారం ఓ ఇంట్లోకి చొరబడి మరణాయుధాలతో బెదించించి చోరీకి పాల్పడిన ఘటన కాటూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఒక ఇంట్లో చోరికి ప్రణాళికతో వచ్చిన దొంగ మరో ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న సీపీ తిరుమలరావు బాధితుడు ఆరేపల్లి రజినిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో దుండగులు ఒరిస్సా భాషలో మాట్లాడినట్లు బాధితుడు తెలిపాడు. కాగా క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్వాప్తు చేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment