
పోలీసుల అదుపులో నిందితుడు
చాంద్రాయణగుట్ట: ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను ఫలక్‌నుమా పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫలక్‌నుమా, ముస్తఫానగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ అక్రం, సుల్తాన్‌ఖాన్, మహ్మద్ అక్తర్, పర్వేజ్ ముఠాగా ఏర్పడి ఐపీఎల్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. సోమవారం రాత్రి జరిగిన కింగ్స్–11 పంజాబ్, ఢిల్లీ క్యాపిట్స్ ఐపీఎల్ మ్యాచ్‌కు సెల్‌ఫోన్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. దీనిపై సమాచారం అందడంతో ఎస్సై రమేష్ నాయక్ నేతృత్వంలోని బృందం దాడులు నిర్వహించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా ఫర్వేజ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి నుంచి రూ.1,00,500 నగదు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment