వెంకటాచలం (నెల్లూరు): ఓ యువకుడు బాలికను కిడ్నాప్ చేసి, ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని ఈదగాలిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక బంధువుల సమాచారం మేరకు.. ఈదగాలి ఎస్టీ కాలనీకి చెందిన చందు అనే యువకుడు సర్వేపల్లిలోని ఎస్‌ఎన్‌జీ బీరు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఈదగాలి దళితవాడకు చెందిన బాలిక అదే బీరు ఫ్యాక్టరీలో పనిచేస్తుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం పెరి గింది. అయితే సోమవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన బాలిక మధ్యాహ్నం ఇంటికి చేరుకోకపోవడంతో బాలిక తల్లిదండ్రులు బంధువుల గ్రామాల్లో విచారించిన ఆచూకీ తెలియలేదు. అయి తే బుధవారం ఉదయం ఈదగాలి పొలాల సమీపంలో బాలిక గాయాలతో పడి ఉండటంతో గ్రామస్తులు గుర్తించి ఇంటికి తీసుకెళ్లారు. చందు తనపై లైంగికంగా దాడి చేసి గాయ పరి చాడని బాలిక చెప్పడంతో వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment