
సాక్షి, తిరువనంతపురం : మరో దారుణ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళలో ఓ వ్యక్తి యువతిపై అత్యాచారయత్నం చేసిన దృశ్యాలు సీసీటీవీలో నమోదు అయ్యాయి. కోజికోడ్‌లోని ఓ వీధిలో పట్టపగలే ఈ దారుణం చోటు చేసుకోవటం గమనార్హం.
ఈ నెల 18న వైఎంసీఏ రోడ్డులో అప్పుడే ఊరి నుంచి వచ్చిన యువతి తాను ఉంటున్న హాస్టల్‌కు నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో నిందితుడు ఆమెను అనుసరించాడు. వీధి చివరకు వెళ్లాక.. ఎవరూ లేరని నిర్ధారించుకుని ఆమెను పొదల్లోకి లాక్కెళ్లాలని యత్నించాడు. ఆమె గట్టిగా అరుస్తూ ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ ఆ వీధిలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వీడియో ఆధారంగా జంషీర్ ను గుర్తించిన నడక్కవ్ పోలీసులు మూడు రోజుల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు.
కాగా, నిందితుడిని 33 ఏళ్ల జంషేర్‌గా గుర్తించిన పోలీసులు.. గతంలోనూ అతనిపై పలు అత్యాచారయత్నం కేసులు నమోదయ్యాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment