
కర్నూలు, మహానంది: నల్లమల ఘాట్‌రోడ్డులోనినంద్యాల–గిద్దలూరు రైల్వేమార్గంలో పచ్చర్ల–చలమ మధ్యలో ఉన్నదొరబావి వంతెన వద్దరైలు ఢీకొని చిరుత మృతి చెందింది. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. నంద్యాల డీఎఫ్‌ఓ శివశంకర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. సుమారు తొమ్మిది నెలల వయసున్న ఆడ చిరుత రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయం అటవీ అధికారులకు సాయంత్రం తెలియడంతో అక్కడికి చేరుకుని పరిశీలించారు. డోన్–గుంటూరు ప్యాసింజర్ రైలు వెళ్లే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. చిరుత కళేబరానికి శనివారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment