
భీమవరంలోని ఆస్పత్రిలో వివరాలు నమోదు చేసుకుంటున్న సీఐ ఆళ్ల కృష్ణభగవాన్
పశ్చిమగోదావరి, పాలకోడేరు: వారు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శారీరకంగా కలుసుకున్నారు. ప్రేయసి పెళ్లి చేసుకోమని అడిగిందని ఆ ప్రియుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్రం చేశాడు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి నమ్మించి మోసం చేశాడని ఆ ప్రేయసి కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామానికి చెందిన గుమ్మళ్ల మార్తమ్మ ఇంటర్ వరకూ చదివి ఇంట్లో ఉంటోంది. అదే గ్రామానికి చెందిన మాండ్రు చంద్రపాల్, మార్తమ్మ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చంద్రపాల్ పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో వారు భీమవరంంలో శారీరకంగా కలుసుకున్నారు.
ఈ నేపథ్యంలో చంద్రపాల్‌ను పెళ్లి చేసుకోమని అడిగిందని మంగళవారం అతను పురుగు మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బంధువులు చూసి అతడిని ఆస్పత్రిలో చేర్పించడంతో కోలుకుంటున్నాడు. చంద్రపాల్ పెళ్లి చేసుకోనని చెప్పడంతో మార్తమ్మ ఆమె తల్లి వాడే థైరాయిడ్ మందులు బుధవారం ఉదయం అధికంగా వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు తరలించారు. పాలకోడేరు పోలీసులు కేసు నమోదు చేసి భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు కేసు బదిలీ చేశారు. భీమవరం వన్‌టౌన్ సీఐ ఆళ్ల కృష్ణభగవాన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment