ప్రియురాలి కోసం ఆమె మెట్టినింటికి వెళ్లడంతో.. | Madhya Pradesh Man Caught With Lover At Her In Laws Home | Sakshi

ప్రియురాలి కోసం ఆమె మెట్టినింటికి వెళ్లడంతో..

Dec 9 2019 7:22 PM | Updated on Dec 9 2019 7:28 PM

Madhya Pradesh Man Caught With Lover At Her In Laws Home - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

ప్రియురాలితో ఆమె మెట్టినింట పట్టుబడిన వ్యక్తిని స్ధానికులు చితకబాదిన ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది.

భింద్‌ : ప్రియురాలి కోసం ఏకంగా ఆమె అత్తవారింటికి వెళ్లిన ప్రబుద్ధుడికి స్ధానికులు దేహశుద్ధి చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని బింధ్‌ జిల్లాలో వెలుగుచూసింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన వివాహితతో వివాహేతర సంబంధం కలిగిన వ్యక్తి ఏకంగా ఆమె మెట్టినింటికి వెళ్లి పట్టుబడటంతో చావుదెబ్బలు తిన్నాడు. ఈనెల 4న బింధ్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని గ్రామంలో ఈ ఘటన బయటపడిందని ఎస్పీ రుడాల్ఫ్‌ అల్వార్స్‌ వెల్లడించారు. మహిళ భర్త జైపూర్‌లో పనిచేస్తుండగా ఆమెను కలిసేందుకు వెళ్లిన వ్యక్తిని గ్రామస్తులు చెట్టుకు కట్టేసి చితకబాదారు. మహిళను సైతం చిత్రహింసలకు గురిచేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీరిపై దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement