సాక్షి, గాంధీనగర్: దేశంలో అగ్నిప్రమాదాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. మొన్న ముంబైలో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 14మంది మృతిచెందిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం చోటుచేసుకున్న రెండు అగ్నిప్రమాదాల్లో 8 మంది సజీవదహనమయ్యారు. గుజరాత్‌లోని శిబర్‌లో జరిగిన ప్రమాదంలో ముగ్గరు చిన్నారులు మృతిచెందగా.. రాజస్థాన్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ఒకే ఫ్యామిలీకి చెందిన 5 మంది అగ్నికి ఆహుతయ్యారు.
గుజరాత్ లో శుక్రవారం రాత్రి మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాజ్‌కోట్లోని ప్రాణ్‌స్లా గ్రామంలో ఓ కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు చనిపోగా.. మరో 15 మందికి గాయాలయ్యాయి. షాట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని పోలీసుల విచారణలో వెల్లడైంది.
కుటుంబం మొత్తం అగ్నికి ఆహుతి
అయితే.. ఇలాంటి అగ్ని ప్రమాదమే రాజస్థాన్లో శనివారం ఉదయం జరిగింది. నగరంలోని విద్యానగర్‌లోని ఓ ఇంటిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక కుటుంబంలోని సభ్యులు సజీవదహనం అయ్యారు. సమాచారం తెలుసుకుని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రమాదం జరిగిన చోటుకి వెళ్లి మంటలను అదుపు చేశారు. గ్యాస్ సిలిండర్ లికేజీ వల్లనే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment