
ప్రతీకాత్మకచిత్రం
లక్నో : వ్యసనాలు మనిషిని ఎంతలా దిగజారుస్తాయో వెల్లడించే ఘటన యూపీలో వెలుగుచూసింది. మద్యం, జూదానికి బానిసైన ఓ వ్యక్తి తన భార్యను పందెంగా ఉంచి అందులో ఓటమి పాలవడంతో అతని స్నేహితులే ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. జాన్పూర్ జిల్లా జఫరాబాద్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. తన భర్త మద్యానికి బానిసై డబ్బు లేకపోవడంతో చివరికి పందెంగా తనను ముందుకుతెచ్చాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.
తన భర్త స్నేహితుడు అరుణ్, బంధువు అనిల్ తరచూ మద్యం సేవించేందుకు, జూదం కోసం తమ ఇంటికి వచ్చేవారని చెప్పారు. ఈ ఘటనతో మనస్ధాపం చెందిన బాధితురాలు తన మామ ఇంటికి వెళ్లగా ఆమెను అనుసరించిన భర్త పొరపాటు జరిగిందని వేడుకోవడంతో భర్త కారులో తిరిగివచ్చింది. మార్గమధ్యంలో కారును నిలిపివేసిన నిందితుడు తన స్నేహితులను మరోసారి ఆమెపై లైంగిక దాడి చేసేందుకు సహకరించాడు. జఫరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించడంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించారు. పోలీసులు తక్షణమే కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ కాపీని తమకు సమర్పించాలని న్యాయస్ధానం పోలీసులను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment