
అరెస్టు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ నరేష్‌కుమార్
సాక్షి, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలోని బలరాంతండా గ్రామపరిధిలో జరిగిన సాముహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో పరారీలో ఉన్న ఇస్లావత్ కిషన్ అనే యువకుడిని అరెస్టు చేశామని డీఎస్పీ ఆంగోతు నరేష్‌కుమార్ తెలిపారు. మహబూబాబాద్ రూరల్ పోలీసు స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని బలరాంతండా గ్రామ శివారులో ఈనెల 7వ తేదీ రాత్రి యువతిపై సాముహిక అత్యాచారం జరిగిన ఘటన తెలిసిందేనన్నారు.
ఈ కేసులో తొమ్మిది మందిని నిందితులుగా గుర్తించగా ఎనిమిది మందిని ఈనెల 10వ తేదీన అరెస్టు చేశామన్నారు. పరారీలో ఉన్న ఒక యువకుడు ఇస్లావత్ కిషన్‌ను కూడా అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ జూపల్లి వెంకటరత్నం, ఎస్సై సీహెచ్.రమేష్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment