అంబేద్కర్ సెంటర్‌లో ధర్నా చేస్తున్న మృతుడు తరపు వ్యక్తులతో చర్చిస్తున్న ఎస్సై రామచంద్రరావు
సాక్షి, భీమవరం(పశ్చిమగోదావరి) : భీమవరం చినవంతెనపై నుంచి శనివారం రాత్రి యనమదుర్రు డ్రెయిన్‌లో దూకి గల్లంతైన యువకుడి మృతదేహం ఆదివారం లభ్యమైంది. మృతుడు చినపేటకు చెందిన దాసిరాజు(19)గా పోలీసులు గుర్తించారు. రాజు డ్రెయిన్‌లో దూకిన సమయంలో చూసిన కొందరు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు గాలించారు. చీకటిగా ఉండడం మరోవైపు వర్షం పడుతుండడంతో యువకుడి ఆచూకీ తెలియలేదు.
రాజు కుటుంబసభ్యులు బంధువులు, స్నేహితులు యనమదుర్రు డ్రెయిన్ గట్టు వెంట తెల్లవార్లు వెతుకుతూనే ఉన్నారు. గాలింపు చర్యలు వేగంగా చేపట్టడం లేదని మృతుడి తరపు వ్యక్తులు అంబేద్కర్ సెంటర్‌లో ధర్నా చేశారు. టూటౌన్ ఎస్సై సీహెచ్‌ఎస్ రామచంద్రరావు సంఘటనా స్థలానికి చేరుకుని వారికి నచ్చచెప్పి ధర్నా విరమింప చేశారు. తరువాత మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment