పండుగపూట విషాదం  | Man Is Dead Puduru Road Accident In Rangareddy District | Sakshi
Sakshi News home page

పండుగపూట విషాదం 

Published Fri, Mar 22 2019 2:32 PM | Last Updated on Fri, Mar 22 2019 2:33 PM

Man Is Dead  Puduru Road Accident In Rangareddy District  - Sakshi

సంఘటన స్థలంలో మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబీకులు   

సాక్షి, పూడూరు: హోలీ పండుగ రోజే ఓ ఇంట్లో విషాదం నిండింది. రెండు బైకులు ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన చన్గోముల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. చన్గోముల్‌ ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరు మండలంలోని సోమన్‌గుర్తికి చెందిన పంబాల నగేశ్‌ (42) రైతు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. గురువారం ఉదయం హోలీ వేడుకల్లో పాల్గొని అందరితో సరదాగా గడిపాడు.

ఆ తర్వాత ద్విచక్ర వాహనంపై గ్రామం నుంచి పొలానికి బయలుదేరాడు. అయితే సోమన్‌గుర్తి గేటు నుంచి శ్రీనివాస్, వెంకటేశ్వర్లు గ్రామం వైపు వస్తూ మూలమలుపులో ఇరువురు ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన నగేశ్‌ అక్కడి కక్కడే మృతిచెందాడు. మరో బైక్‌పై ఉన్న వారు శ్రీనివాస్, వెంకటేశ్వర్లకు బలమైన గాయాల య్యాయి. వెంటనే పరిగిలోని ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య బాలమణి, ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. మృతుడి భార్య బాలమణి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు న్నట్లు చన్గోముల్‌ ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌ తెలి పారు. కాగా హోళీ పండుగపూట నగేశ్‌ మృతి చెందడంతో సోమన్‌గుర్తిలో విషాదఛాయలు అలుముకున్నాయి. సరదాగా గడిపిన తన భర్త పొలానికి వెళ్లి వస్తానని చెప్పి అందరినీ విడిచి వెళ్లావని గుండెలవిసేలా రోదించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement