సంఘటన స్థలంలో ప్రకాశరావు మృతదేహం
మధురవాడ/పీఎం పాలెం(భీమిలి): వాంబే కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో కొట్టుకోవడంతో తీవ్ర గాయాలపాలైన ఒకరు దుర్మరణం పాలయ్యారు. జీవీఎంసీ 5వ వార్డు పరిధి మిథిలాపురి వుడా కాలనీ వంద అడుగుల రోడ్డులో బుధవారం ఉదయం 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతంలో సంచలనం రేకెత్తించిన ఈ ఘటనకు సంబంధించి పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ కె.లక్ష్మణమూర్తి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అవివాహితుడైన స్థానం ప్రకాశరావు (40) వాంబే కాలనీలోని బ్లాకు నంబరు 6లోని ఓ ప్లాటులో నివసిస్తున్నాడు. కూలి పనులు చేసుకునే ప్రకాశరావు మద్యానికి బానిస కావడంతో కొమ్మాదిలో నివసిస్తున్న సోదరులు సుబ్రహ్మణ్యం, శేషగిరిరావు అతనితో సంబంధాలు తెంచుకున్నారు. ఇతని తండ్రి కొద్ది కాలం క్రితం చనిపోగా... తల్లి తులసి మిగిలిన కుమారుల వద్ద ఉంటోంది. దీంతో నచ్చినప్పుడు కూలి పనికి వెళ్తూ వచ్చిన డబ్బులతో మద్యం తాగడమే వ్యాపకంగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన కరిమెల్ల సూర్యంతో పరిచయం ఏర్పడింది. విజయనగరం జిల్లాకు చెందిన సూర్యం కార్పెంటర్ పనులు చేస్తూ నివసిస్తున్నాడు.
తెల్లారేసరికే మద్యం తాగి కొట్లాట
బుధవారం తెల్లవారుజామున మధురవాడలోని ప్రశాంతమైన మిథిలాపురి వుడా కాలనీ 100 అడుగుల రోడ్డులోని ఓ మద్యం షాపు సమీపంలో ప్రకాశరావు, సూర్యం మద్యం మత్తులో కొట్టుకున్నారు. ఆ సమయంలో సూర్యం రాళ్లతో ప్రకాశరావును గట్టిగా కొట్టడంతో తీవ్ర గాయాలై రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందా డు. అనంతరం హంతకుడు సూర్యం కూడా మత్తులో ఘటనా స్థలిలోనే పడిపోయాడు. ఉద యం వాకింగ్‌కు ఈ మార్గంలో వెళ్తున్న వారు జరి గిన ఘటనతో ఉలిక్కిపడి పీఎంపాలెం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న సీఐ కె.లక్ష్మణమూర్తి, ఎస్‌ఐలు గణేష్, శ్యామ్‌సుందర్ వివరాలు సేకరించారు. మృతుని శరీరంపై ఉన్న గాయాలు పరిశీలించారు. మృతుని సోదరుడు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసిన పోలీసులు సూర్యంను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో సూర్యం మద్యం మత్తులో ఉన్నాడని, అతని మానసిక స్థితి అనుమానంగా ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ లక్ష్మణమూర్తి తెలిపారు. మరోవైపు ఘటనా స్థలికి సమీపంలో ఉన్న మద్యం షాపు మూసివేసి ఉంది.
మద్యం ఏరులై పారడం వల్లే హత్యలు
సమయ పాలన,నియమనిబంధనలు పాటి ంచకపోవడం, నియంత్రణ లేకుండా మద్యం ఏరులై పారుతుండడంతో మందు బాబులు రెచ్చిపోతున్నారు. ఆ మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియనివిధంగా వ్యవహరిస్తున్నారు. మత్తులో ఘర్షణలకు దిగి హత్యలకు పాల్పడుతూ ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతున్నారు. మధురవాడలోనే అత్యంత ప్రశాంతమైన మిథి లాపురి వుడా కాలనీలో ఎక్కువగా రిటైర్డ్ ఉద్యోగులు,ఉద్యోగులు నివసిస్తుంటారు. ఇలాంటి ప్రశాం త కాలనీలో హత్య జరగడం బుధవారం కలకలం రేపింది. అయితే మధురవాడ ప్రాంతంలో మద్యం అమ్మకాలకు సమయ పాల న, నిబంధనలు ఏమీ లేవని, పైగా దీనిపై నియంత్రణ కూడా లేక పోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరో పిస్తున్నారు. ఈ హత్య నేపథ్యంలో బుధవారం సా యంత్రం ఎక్సైజ్ పోలీసులు మధురవాడ 4, 5వ వార్డుల్లోని మద్యందుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. పోలీస్ ఉన్నతాధికారులు స్పంది ంచి శాంతిభద్రతలను పరిరక్షించాలని, మద్యం అమ్మకాలను నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment