
అడివెన్న మృతదేహం వద్ద రోధిస్తున్న కుటుంబ సభ్యులు
మల్దకల్ : కొద్ది సేపట్లోనే కూతురు వివాహం జరుగుతుందనగా.. వధువు తండ్రి గుండెపోటుతో మృతిచెందిన విషాద సంఘటన మల్దకల్ మండలం మద్దెలబండలో చోటు చేసుకుంది. గ్రామస్తు ల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన అడివెన్న(40) తన రెండెకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గురువారం తన కుమార్తె చిట్టి వివాహం జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇంక కొద్ది క్షణాల్లో పెళ్లి జరుగనుండగా గుండెపోటుకు గురై కుప్పకూలాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. మార్గమద్యలోనే మృతి చెందాడు. ఈ సంఘటనతో పెళ్లికి వచ్చిన వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కూతురు వివాహం కళ్లారా చూడలేకపోయాడంటూ అక్కడున్నవారంతా కంటతడి పెట్టారు. కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. మృతునికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. విషయం తెలుసుకున్న వివిధ పార్టీల నాయకులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment