గాంధీ హట్స్‌లో బందోబస్తు , రమేష్ గౌడ్(ఫైల్)
మారేడుపల్లి : ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవను ఆపేందుకు వెళ్లిన వ్యక్తి హత్యకు గురైన సంఘటన మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ మట్టయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.జేబీఎస్ బస్టాండ్ సమీపంలోని గాంధీహట్స్‌లో ఉంటున్న నరేష్ శనివారం రాత్రి మల్లన్న గుడి వద్ద ఉన్న స్నేహితులకు కొద్ది దూరం నుంచి చెయ్యి ఊపుతూ హాయ్ అంటూ సైగ చేశాడు. ఆదే సమయంలో శుభకార్యానికి వెళ్లేందుకు చోటు ఆలియాస్ మహ్మద్ ఇస్మాయిల్ అనే వ్యక్తి తన భార్య, బిడ్డలతో ఇంటి ముందు నిల్చుని ఉన్నాడు. నరేష్ తన కుటుంబసభ్యులకే హాయ్ చెప్పాడని భావించిన ఇస్మాయిల్ అతడి గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిని గుర్తించిన నరేష్ మేనమామ రమేష్ గౌడ్ (39) బయటికు వచ్చి వారికి సర్ది చెప్పేందుకు ప్రయత్నించాడు.
దీంతో ఆగ్రహానికి లోనైన ఇస్మాయిల్ ఒక్కసారిగా రమేష్‌గౌడ్‌పై దాడి చేయడంతో అతను కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఇస్మాయిల్ పై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాంధీ హట్స్‌లో ఉద్రిక్తత రమేష్ గౌడ్ మృతితో గాంధీ హట్స్ లో ఉద్రిక్తత నెలకొంది. మృతుని బంధువులు, నిందితుడి సంబందీకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో సీఐ మట్టయ్య ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి నుండి ఆదివారం రాత్రి వరకు పికెటింగ్‌ను కొనసాగించారు.
Comments
Please login to add a commentAdd a comment