ఘటనలో కాలిపోయిన ఇళ్లు
సాక్షి, వరంగల్ రూరల్ : దామెర మండలంలో దారుణం చోటుచేసుకుంది. తండ్రి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో కుటుంబసభ్యులపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ కొడుకు. ఈ సంఘటన సోమవారం వరంగల్ జిల్లాలోని దామెర మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా దామెర మండలం కంఠాత్మకూరుకు చెందిన కార్తీక్ అనే వ్యక్తికి తన తండ్రి కుమార స్వామి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసింది.
దీంతో ఆగ్రహించిన కార్తీక్ తండ్రితో సహా ఇతర కుటుంబంసభ్యులపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో అతడి నానమ్మ రాజమ్మ, తండ్రి కుమార స్వామి, సుజాత అనే మహిళ చనిపోగా మరొకరు గాయపడ్డారు. అనంతరం కార్తీక్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. తండ్రి అక్రమ సంబంధం కారణంగానే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులకు వివరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment