
గురు తేజ్ బహదూర్ ఆసుపత్రి
న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను అంటిస్తున్నాడంటూ ఆసుపత్రి సెక్యూరిటీ గార్డుపై ఇటుకతో దాడి చేశాడో వ్యక్తి. ఈ సంఘటన దేశ రాజధానిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీ, హర్ష విహార్‌కు చెందిన విజయ్ కుమార్.. గురు తేజ్ బహదూర్ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆదివారం ఇంటి మేడపై వ్యాయామం చేస్తుండగా పక్కింటికి చెందిన వికాశ్ అక్కడికి వచ్చాడు. పొరిగింటి వారికి కరోనా వైరస్ అంటిస్తున్నాడంటూ విజయ్‌పై ఇటుకతో దాడి చేశాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన కొందరు వెంటనే విజయ్‌ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుడు వికాశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇంటి మేడ విషయంలో తలెత్తిన గొడవ కారణంగా విజయ్‌పై వికాశ్ దాడి చేసినట్లు తేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment