సిగ్నల్‌ను దాటు.. లేదంటే.. | Man Threats to Women In Traffic Signal Karnataka | Sakshi
Sakshi News home page

సిగ్నల్‌ను దాటు.. లేదంటే..

Published Mon, Oct 1 2018 10:10 AM | Last Updated on Thu, Jul 11 2019 1:14 PM

Man Threats to Women In Traffic Signal Karnataka - Sakshi

సాక్షి, బెంగళూరు: సిగ్నల్‌ను తొందరగా దాటు.. లేదంటే అత్యాచారం చేస్తానంటూ ద్విచక్రవాహనదారుడు కారు నడుపుతున్న మహిళను బెదిరించిన ఘటన బెంగళూరులోని తిలక్‌నగర పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. తిలక్‌నగరలోని బీలాల్‌ మసీదు వద్ద  రెడ్‌ సిగ్నల్‌ పడటంతో  కారులో వెళ్తున్న ఓ మహిళ వాహనాన్ని నిలిపింది.

అయితే దారి వదలాలని కారు వెనుక ద్విచక్రవాహనంలో వచ్చిన చంద్రశేఖర్‌ హారన్‌ కొట్టాడు. అనంతరం కారు వద్దకు వచ్చి దుర్భాషలాడాడు. తనకు దారి వదలకపోతే  రేప్‌  చేస్తానంటూ బెదిరించాడు. అంతటితో వదలకుండా కారును వెంబడించాడు. దారి మధ్యలో కారును అడ్డుకొని ఆమె చేయి పట్టుకున్నాడు. ఫొటోగ్రాఫరైన ఆ మహిళ చంద్రశేఖర్‌కు చెందిన బైక్‌ నంబర్‌ను ఫొటో తీసింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు చంద్రశేఖర్‌ను అరెస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement