
దౌలాఖాన్ ఫ్లై ఓవర్ (ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ : జనంతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఫ్లై ఓవర్ గ్రిల్‌కు ఓ వ్యక్తి మృతదేహం వేలాడుతుండటం కలకలం రేపింది. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఇది గమనించి పోలీసులకు సమాచారం అందించగా వారు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర ఢిల్లీ అజాద్‌పూర్ సమీపంలోని ఎంసీడీ కాలనీలో 38 ఏళ్ల సత్యేంద్ర కుటుంబుం నివాసం ఉంటోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం అతడి మృతదేహం దౌలాఖాన్ ఫ్లై ఓవర్ గ్రిల్‌కు వేలాడుతూ కనిపించింది. ఇది గమనించిన ఓ వ్యక్తి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి జేబులో ఉన్న కార్డులు, ఇతరత్రా పేపర్లు పరిశీలించిన అధికారులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం అనంతరం అతడి ఫ్యామిలీకి సత్యేంద్ర మృతదేహాన్ని అప్పగించారు. మృతుడి వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని చెప్పారు. ఫోరెన్సిక్ నివేదిక వస్తే.. అసలు ఇది హత్యా.. లేక ఆత్మహత్యా తెలియనుందని పోలీసులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment