
చెన్నై : చెన్నై కేకేనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని మీనాక్షి ఇంజినీరింగ్ కళాశాల గేటు ఎదుటే అశ్విని అనే విద్యార్థినిని ఓ దుండగుడు కత్తితో నరికి చంపారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనకు పాల్పడి... అతడు అక్కడ నుంచి పారిపోతుండగా, స్థానికులు అడ్డుకుని దేహశుద్ధి చేశారు. వివరాల్లోకి వెళితే...చెన్నై కేకే నగర్లోని మీనాక్షి కళాశాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతున్న అశ్విని కాలేజీ ముగియడంతో రోజులాగే ఇంటికి వెళ్లేందుకు గేట్ ముందు వేచి చూస్తోంది. అంతలో అటుగా వచ్చిన ఓ యువకుడు గేటు ముందు నిల్చుని ఉన్న ఆమెపై కత్తితో విచక్షణారహితం పొడిచాడు.
దీంతో తీవ్రంగా గాయపడిన అశ్విని రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది. అదే సమయం పారిపోయేందుకు ప్రయత్నించిన యువకుడిని స్థానికులు పట్టుకుని చితకబాదారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు. కాగా స్థానికుల దాడితో తీవ్రంగా గాయపడిన దుండగుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment