ప్రతీకాత్మక చిత్రం
గాంధీనగర్ : ప్రేమ వ్యవహరం ఓ మైనర్ బాలిక ప్రాణం తీసింది. ప్రియుడితో సన్నిహితంగా గడపడం ఆమె పాలిట శాపంగా మారింది. సంతోషాన్ని పంచుతాడు అనుకున్న ప్రియుడే.. తన జీవితాన్ని రోడ్డున పడేయడంతో తట్టుకోలేని బాలిక తనువుచాలించింది. చివరికి తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచింది. గుజరాత్‌లోని అలహాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. 16 ఏళ్ల బాలిక ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ క్రమంలోనే ఎవరికీ తెలియకుండా అతడితో రహస్యంగా గడుపుతూ, సన్నిహితంగా మెలిగింది. అయితే బాలికతో ప్రైవేటుగా గడిపిన వ్యవహారమంతా వీడియో తీసిన ప్రియుడు ఫోన్ కెమెరాలో బంధించాడు. అంతటితో ఆగకుండా ఆ వీడియోలను తన మిత్రులకు షేర్ చేశాడు.
ప్రియుడు మిత్రులు ఆ వీడియోలను మరికొంతమందికి షేర్ చేశారు. ఇలా ఆ బాలిక వ్యక్తిగత జీవితానంతటినీ ప్రియుడు రోడ్డుమీద పడేశాడు. ఈ విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పటికే తీవ్ర మనస్థాపానికి గురైన బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రియుడిని అదుపుకులోకి తీసుకుని, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మైనర్ బాలికపై అత్యాచారం, పోక్సో వంటి చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు. అలాగే బాలిక వ్యక్తిగత వీడియోలను ఇతరులకు షేర్ చేసిన ప్రియుడి స్నేహితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment