సినిమా చాన్స్‌ ఇప్పిస్తానని బాలికపై.. | Molestation on Girl in Tamil Nadu | Sakshi
Sakshi News home page

సినిమా చాన్స్‌ ఇప్పిస్తానని బాలికపై లైంగికదాడి

Published Tue, Feb 5 2019 11:35 AM | Last Updated on Tue, Feb 5 2019 11:35 AM

Molestation on Girl in Tamil Nadu - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: సినిమా చాన్సులు పేరిట మాయమాటలు చెప్పి బాలికపై లైంగికదాడికి పాల్పడిన చెన్నైకి చెందిన ఎంబీఏ పట్టభద్రుడిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ముగప్పేర్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక పదో తరగతితో చదువు ముగించి సినిమాల్లో వేషాలకోసం ప్రయత్నాలు సాగిస్తోంది. చెన్నై పెరియమేడులోని ఒక సినీ దర్శకుని వద్ద గత రెండు వారాలుగా నటనపై శిక్షణ పొందుతోంది. ఈనెల 2వ తేదీన శిక్షణకని ఇంటి నుంచి బయలుదేరిన బాలిక మరలా ఇంటికి చేరుకోలేదు. బాలిక తండ్రి దర్శకుని వద్దకు వచ్చి విచారించగా తన స్నేహితునితో మహాబలిపురంలో ఉన్నానని, తనను వెతకవద్దని పేర్కొంటూ బాలిక నుంచి ఎస్‌ఎమ్‌ఎస్‌ వచ్చిన సంగతిని తెలిపాడు.

బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా మహాబలిపురంలోని ఒక లాడ్జిలో బాలిక ఒక యువకుడితో కలిసి ఉండగా పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. సినిమా చాన్స్‌ల కోసం టిక్‌టాక్‌ యాప్‌లో సదరు బాలిక కొన్ని సన్నివేశాల నటనను పొందుపరచింది. వాటిని చూసిన తిరువెర్కేడుకు చెందిన దయాళన్‌ (31) అనే యువకుడు సినిమా చాన్స్‌లు ఇప్పిస్తానని నమ్మబలికాడు. మహాబలిపురం వస్తే ఒక సినిమా దర్శకుడిని పరిచయం చేస్తానని ఈనెల 2వ తేదీన పిలుచుకువెళ్లాడు. ఇదే అదనుగా బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక మైనర్‌ కావడంతో దయాళన్‌ను పోక్సో చట్టం కింద సోమవారం అరెస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement