
కుమారులతో షేక్ సుల్తానా (ఫైల్)
మల్కాజిగిరి: భర్తతో గొడవపడి ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ అశోక్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.షఫీనగర్‌కు చెందిన షేక్ అహ్మద్, షేక్ సుల్తానా దంపతులకు రహ్మద్(7), అయాన్(4) కుమారులు ఉన్నారు. ఈ నెల 27న భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో సుల్తానా గాంధీనగర్‌లో ఉంటున్న తన తల్లి తహీరాబేగంకు ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో ఆమె సుల్తానా ఇంటికి వచ్చి వారిని నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా, ఆమె పట్టించుకోకుండా ఇద్ద రు కుమారులను తీసుకొని బయటికి వెళ్లిపోయింది. గాంధీనగర్‌లో ఇంటి వద్దకే వెళ్లి ఉంటుందని భావించి తహీరాబేగం ఇంటికి వచ్చి చూడగా, అక్కడ కుమార్తె కనిపించకపోవ డంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment