వికారాబాద్, పెద్దేముల్: తల్లి మందలించిందని కూతురు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం పెద్దే ముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామానికి చెందిన శాంతమ్మ,బాలప్పకు కుమార్తె,కుమారుడు ఉన్నారు. కొంతకాలంగా కుమార్తె శ్రీలత (25) కు మతిస్థిమితం లేదు. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుండేది.
ఈ క్రమంలో మంగళవారం రాత్రి భోజనం చేసిన తరువాత ఇంటి ముందు శ్రీలత కూర్చిని ఉంది. పొద్దుపోయింది.. ఇంట్లోకి వచ్చి నిద్రించమని చెప్పగా తల్లితో వాగ్వాదం పడింది. ఈ క్రమంలో తల్లి ఆమెను మందలించి ఇంట్లో నిద్రించింది. కుటుంబసభ్యులంతా నిద్రిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్లిన శ్రీలత కిరోసిన్ డబ్బా తీసుకుని బయటకు వచ్చింది. కుటుంబసభ్యులు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఇంటికి గడియ పెట్టింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని శ్రీలత ఆత్మహత్యకు పాల్పడింది. ఆ మంటలకు తాళలేక అరుపుకేకలు వేయడంతో స్థానికులు, కుటుంబసభ్యులు వెంటనే స్పందించారు. అప్పటికే ఆమె పూర్తిగా కాలిపోయి మృతిచెందింది. తల్లి శాంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు మృతదేహం అప్పగించినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment