సాక్షి, గుంటూరు: అనారోగ్యంతో బాధపడుతున్న సంగీత కళాకారుడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. చివరకు ఆత్మహత్యేశరణ్యమని భావించి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలివి.. జిల్లాలోని అరండల్పేట శ్రీనగర్కు చెందిన సుదర్శనం జాన్సన్(63)కు సంగీత కళాకారుడిగా మంచి పేరుంది. ముప్పయేళ్లుగా సంగీత విభావరిలు నిర్వహిస్తున్న ఆయన అనేక మందికి సుపరిచితుడు.
కొంతకాలంగాఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ మనోవేదనకు గురయ్యారు. కుటుంబ సభ్యులతో కూడా ఏమాత్రం మాట్లాడకుండా తనలో తానే బాధపడుతుండేవాడు. జాన్సన్ భార్య విజయలక్ష్మి సంగీతం టీచర్గా పనిచేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో జాన్సన్ ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యలు వచ్చి పోలీసులకు సమాచారం అందిచండంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాన్సన్ సంగీత కళాకారుల అసోసియేషన్కు సంబంధించిన వారు చాలా మంది కీలక పదవుల్లో ఉన్నట్లు బంధువులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment