
సాక్షి, నల్గొండ: జిల్లాలోని మాడుగులపల్లి మండలం నారాయణపురం గ్రామ శివారులో దారుణం చోటు చేసుకుంది. గెట్ల పంచాయతీ ఓ మహిళా రైతు ప్రాణం తీసింది. వివరాలు.. నారాయణపురం గ్రామానికి చెందిన మహిళా రైతు మంజుల(55)కు కొన్ని రోజులుగా బంధువులతో పొలం గెట్ల గురించి వివాదం నడుస్తుంది. ఈ నేపథ్యంలో మంజుల బంధువులైన అమృతా రెడ్డి, అతని కుమారుడు గురువారం పొలంలో పని చేసుకుంటున్న ఆమెపై గొడ్డలితో దాడి చేసి నరికి చంపారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన మంజుల భర్త వాసుదేవ రెడ్డిని కూడా తీవ్రంగా గాయ పర్చారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంజుల మృత దేహంతో పాటు వాసుదేవ రెడ్డిని కూడా ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భూ తగాదాలే హత్యకు కారణంగా భావించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అమృతా రెడ్డి, అతని కుమారుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment