
కోల్‌కత్తా : పశ్చిమ బెంగాల్‌కు చెందిన జాతీయ స్థాయి క్రీడాకారిణి మౌప్రియ మిత్రా ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. హూగ్లీ జిల్లాలోని బాండేల్ మనస్పూర్‌లో కల తన నివాసంలో ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. రిలేషన్‌షిప్ వివాదాలతో ఆమె ఒత్తిడికి గురైందని తాము గుర్తించామని, దీనిపై మరింత విచారణ చేపడుతున్నామని బాండేల్‌కు చెందిన పోలీసాఫీసర్ తెలిపారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు.
మౌప్రియ మిత్రా కోలంబోలో జరిగిన సౌత్ ఏసియన్ ఆక్వాటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో రెండు పతకాలు సాధించింది. ఒకటి గోల్డ్, మరొకటి సిల్వర్. జిమ్నాస్టిక్స్‌గా తన కెరీర్ ప్రారంభించి అనంతరం ఓ ప్రమాదంలో తన కాలుకి గాయం కావడంతో దాన్ని వదిలిపెట్టారు. అనంతరం స్విమ్మింగ్‌పై ఆమె పట్టు సాధించారు. అయితే ఈమె నివాసంలో ఎలాంటి సూసైడ్ నోటు దొరకలేదు.
Comments
Please login to add a commentAdd a comment