ఎదురుకాల్పుల్లో 17 మంది భద్రతా సిబ్బంది మృతి | Naxal encounter : Bodies Of 17 Missing Cops Found In Chhattisgarh | Sakshi
Sakshi News home page

ఎదురుకాల్పుల్లో 17 మంది భద్రతా సిబ్బంది మృతి

Published Sun, Mar 22 2020 3:48 PM | Last Updated on Sun, Mar 22 2020 3:51 PM

Naxal encounter : Bodies Of 17 Missing Cops Found In Chhattisgarh - Sakshi

సుక్మా : ఛత్తీస్‌గఢ్‌లోని జరిగిన ఎదురుకాల్పుల్లో 17 మంది భద్రతా సిబ్బంది మృతిచెందారు. శనివారం సుక్మా జిల్లాలోని చింతగుప్ప పోలీసు స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌ అనంతరం 17 మంది పోలీసులు కనిపించకుండా పోయారు. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టాయి. ఆదివారం రోజున అడవుల్లో పోలీసుల మృతదేహాలను గుర్తించి.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ తెలిపారు. 

కాగా, శనివారం రోజున స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌, డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్ట్స్‌కు ప్రత్యేక బలగాలు కుంబింగ్‌ చేపట్టాయి. అయితే బలగాలు మిన్పా గ్రామానికి చేరుకున్న సమయంలో.. అక్కడ భారీగా మోహరించిన నక్సల్స్‌ ఎదుకాల్పులకు దిగాయి. దాదాపు రెండున్నర గంటల పాటు ఇరువర్గాల మధ్య భీకర పోరు సాగింది. ఈ కాల్పుల్లో 15 మంది భద్రత సిబ్బంది గాయపడగా, 17 మంది కనిపించకుండా పోయారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement