మృతులు, కారు వెలికి తీస్తున్న దృశ్యాలు (ఫైల్)
సాక్షి, కరీంనగర్ : అల్గునూర్ వద్ద కాకతీయ కాలువలో కుటుంబం జలసమాధి అయిన ఘటనలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. అది ప్రమాదం కాదని, ఆత్మహత్య అని భావిస్తున్న పోలీసుల అనుమానాలకు బలం చేకూర్చేలా ఓ ఆధారం లభించింది. ఈ కారు ప్రమాదంపై పోలీసులు మొదటినుంచి పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సత్యనారాయణ రెడ్డి ఫెర్టిలైజర్ షాపులో దొరికిన డైరీ వారి అనుమానాలకు ఊతమిస్తోంది. ఆ డైరీలో యాక్సిడెంట్‌కు ముందే తన ఆస్తి అంతా టీటీడీకి అప్పగించాలని సత్యనారాయణ రాసుకున్నారు. దీంతో ఇది ఖచ్చితంగా ఆత్మహత్యేనని పోలీసులు భావిస్తున్నారు. ’( జల సమాధి; ఆత్మహత్యా.. ప్రమాదమా! )
కాగా, కొన్ని నెలల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటనలో పెద్దపల్లి శాసనసభ్యుడు దాసరి మనోహర్‌రెడ్డి సోదరి రాధ, ఆమె భర్త సత్యనారాయణరెడ్డి, కుమార్తె వినయశ్రీలు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగిన 21రోజులకు వెలుగులోకి వచ్చింది. కాకతీయ కాలువలో గల్లంతైన మహిళకోసం వెతుకుతుండగా కారు బయటపడింది. పోలీసులు క్రేన్‌తో కారును బయటకు తీయగా వీరి శవాలు కుళ్లిన స్థితిలో దర్శనమిచ్చాయి. దీంతో మృతదేహాలకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం స్మశానానికి తరలించి అంత్యక్రియలు జరిపారు. ( సహస్ర కాదు వినయశ్రీ... )
చదవండి : ‘వినయశ్రీ లేదంటే నమ్మలేకపోతున్నాం’
Comments
Please login to add a commentAdd a comment