చంపడానికే ఓయూకు రప్పించాడు.. | OU Police Arrested Anusha Killer Venkatesh | Sakshi
Sakshi News home page

చంపడానికే ఓయూకు రప్పించాడు..

Published Wed, Aug 8 2018 9:16 PM | Last Updated on Mon, Aug 20 2018 4:48 PM

OU Police Arrested Anusha Killer Venkatesh - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : విద్యార్థి అనూషను హత్య చేసిన ప్రేమోన్మాది వెంకటేశ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తనను ప్రేమించడం లేదనే కారణంతో వెంకటేశ్‌ అనూషను మంగళవారం హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో మరో ఆసక్తికర అంశం వెలుగుచూసింది. ప్రేమోన్మాది వెంకటేశ్‌కు మరో అమ్మాయితో కూడా ప్రేమ వ్యవహారం ఉందని పోలీసుల విచారణలో తేలింది. ఈ నెపంతోనే అనూష అతన్ని దూరం పెట్టినట్టుగా తెలుస్తోంది. 10 రోజుల నుంచి ఆనూష తనతో మాట్లాడటం మానేయడంతో వెంకటేశ్‌ ఆమెపై కోపం పెంచుకున్నాడు.

ఆమెను అంతమొందించాలని నిర్ణయానికి వచ్చాడు. స్నేహితురాలు ద్వారా అనూషను ఓయూకు రప్పించాడు. ఆ తర్వాత తనను ప్రేమించాల్సిందిగా ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. లేదంటే బ్లేడుతో కోసి చంపుతానని ఆమెని బెదిరించడం మొదలుపెట్టాడు. అతడి బెదిరింపులకు భయపడిపోయిన అనూష భయంతో అతన్ని ప్రేమిస్తానని ఒప్పుకుంది. అయిన వినకుండా వెంకటేశ్‌ బ్లేడుతో ఆమె గొంతు కోసి కిరాతకంగా హతమార్చాడు. ఈ కేసులో నిందితుడు వెంకటేశ్‌ను ఓయూ పోలీసులు అరెస్ట్‌ చేసి, రిమాండుకు తరలించారు.

కన్నీరు మున్నీరవుతున్న అనూష తల్లిదండ్రులు
మంగళవారం సాయంత్రం స్నేహితురాలి ఇంటికి వెళ్తానని చెప్పిన అనూష అరగంటకే శవంగా మారడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు దారుణ హత్యకు గురికావడంతో గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. తమ కూతురిని హత్య చేసిన ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని అనూష తల్లిదండ్రులు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement