
చంఢీ మృతదేహం
కుషాయిగూడ: తల్లిదండ్రులు విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారని మనస్తాపం చెందిన ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీనివాస్, లక్ష్మీ దంపతులు కూలీ పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. వారికి శంకర్, చంఢీ (14) సంతానం. కుటుంబ కలహాల కారణంగా వారు గత మూడేళ్లగా విడివిడిగా ఉంటున్నారు. లక్ష్మీ తన కూతురు చంఢీతో కలిసి చర్లపల్లి ఇందిరాగృహకల్ప కాలనీలో ఉంటుండగా, కుమారుడు శంకర్‌ను తీసుకెళ్లిన తండ్రి శ్రీనివాస్ ఆచూకీ నేటికి తెలియలేదు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి లోనైన చంఢీ మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment