
సాక్షి, చండ్రుగొండ: మండలంలోని తిప్పనపల్లి గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సయ్యద్ చాంద్‌పాషా (25) బొగ్గు టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడ్తున్నాడు. ఈ నెల 8న సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కొన్ని నెలల కిందట పర్వీన్‌తో చాంద్‌పాషాకు వివాహం జరిగింది. మృతుడి బాబాయి రషీద్ ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ కోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం కొత్తగూడెంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.