టేక్మాల్‌లో నిందితులను చూపుతున్న సీఐ రవి
సాక్షి, టేక్మాల్(మెదక్): ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన టేక్మాల్ మండలంలోని సాలోజిపల్లిలో చోటు చేసుకుంది. హత్య కేసును స్థానిక పోలీసులు ఇరవై నాలుగు గంటల్లో చేధించి నిందితులను అరెస్ట్ చేశారు. సంబందిత వివరాలను అల్లాదుర్గం సీఐ రవి గురువారం సాయంత్రం టేక్మాల్ పోలీస్ స్టేషన్‌లో విలేకర్లకు వెల్లడించారు.
మద్యం తాగించి హత్య
టేక్మాల్ మండలంలోని సాలోజిపల్లి గ్రామానికి చెందిన వేముల సాయిలు (38మృతుడు) భార్య నాగమణి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాగమణి గత ఆరు సంవత్సరాలుగా అదే గ్రామానికి చెందిన వడ్డె యాదయ్యతో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో తరుచుగా భార్య భర్తలకు గోడవలు జరిగేవి. భర్తను ఎలాగైనా చంపాలని ప్రియుడైన యాదయ్యతో కలిసి పథకం పన్నింది.
దావత్ చేసుకుందామని వడ్డె యాదయ్య, వేముల సాయిలును ఈనెల 7వ తేదిన సాయంత్రం పిలిపించుకొని టేక్మాల్ శివారులోని చెరువులో కూర్చోని మద్యం సేవించారు. సాయిలుకు ఎక్కువగా మద్యాన్ని సేవింపచేశాడు. బాగా తాగిన అనంతరం యాదయ్య తన మిత్రుడైనా బొడ్డు సురేష్‌కు ఫోన్ చేసి పిలుపించుకున్నాడు. ఇద్దరు కలిసి మరింత మద్యం తాగించి యాదయ్య కర్రతో సాయిలు తలపై కర్రతో బలంగా కొట్టాడు. దీంతో సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఒక్క రోజులో ఛేదన..
ఈనెల 8వ తేదీన విషయం తెలుసుకున్నా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పూర్తి స్థాయిలో వివరాలు సేకరించగా తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. కర్రను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో వడ్డె యాదయ్య ఏ1, సురేష్ ఏ2, నాగమణి ఎ3 ముద్దాయిలు అరెస్ట్ చేసి సంగారెడ్డి జైలుకు పంపినట్లు సీఐ తెలిపారు. ఇందులో రేగోడ్ ఎస్‌ఐ కాశినాథ్, పెద్దశంకరంపేట ఎస్‌ఐ సత్యనారాయణ, టేక్మాల్ ఏఎస్‌ఐ బీమ్లా నాయక్, హెడ్ కానిస్టేబుల్‌లు వీరప్ప, లక్ష్మణ్, కానిస్టేబుల్‌లు రవిందర్, రాజమణి, శ్రీనివాస్, యాదగిరి, సుదీర్, మల్లప్ప తదితరులు ఉన్నారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించి వివరాలు సేకరించి నిందుతుల అరెస్ట్ చేసిన సిబ్బందిని సీఐ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment