
కోతముక్క ఆడుతున్న కౌన్సిలర్ రాజు, పేకాటరాయుళ్లతో సీఐ శరత్‌బాబు
సత్తెనపల్లి: పట్టణంలో రహస్యంగా కోతముక్క పేకాట ఆడుతున్నారని జిల్లా రూరల్ ఎస్పీ సీహెచ్ వెంకటప్పలనాయుడుకు వచ్చిన సమాచారం మేరకు పేకాటరాయుళ్లపై పట్టణ పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని కూరగాయల మార్కెట్ షాపు నెంబర్–18 ఎదుట కోతముక్కతో కూడిన పేకాట ఆడుతున్నారని తెలియడంతో సత్తెనపల్లి అర్బన్ సీఐ శరత్‌బాబు నేతృత్వంలో పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు.
కోతముక్క ఆడుతున్న ఐదుగురిని రెడ్ హ్యండెడ్ గా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.13,150 నగదు స్వాధీన పర్చుకున్నారు.పట్టుబడిన వారిలో 12వ వార్డు టీడీపీ కౌన్సిలర్ సరికొండ వెంకటేశ్వర రాజు (మార్కెట్ రాజు) ఉండడం పట్టణంలో చర్చనీయాంశ మైంది. సరికొండ వెంకటేశ్వరరాజుతో పాటు గౌస్, రాములు, కోటేశ్వరరావు, ఖాదర్‌వలి ఉన్నట్టు సీఐ శరత్‌బాబు తెలిపారు. అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు 12వ వార్డు కౌన్సిలర్ వెంకటేశ్వరరాజును కేసు నుంచి తప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఎస్పీ నుంచి స్థానిక పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఉండటంతో సాధ్యం కాలేదుపేకాట,పట్టణంలో ఇటీవలి కాలంలో కోతముక్క, బెట్టింగులు, అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడ జరిగినా వాటిల్లో అధికార పార్టీ నేతలు ఉంటుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment