
బనశంకరి : చట్టాలను ఉల్లంఘించి అక్రమంగా డ్యాన్స్ బార్లను నిర్వహిస్తున్న రెండు డ్యాన్స్ బార్లపై శనివారం రాత్రి సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.4.25 లక్షల నగదు స్వాధీనం చేసుకుని 78 మంది మహిళలను కాపాడారు. అశోకనగర, కలాసీపాళ్య పోలీస్‌స్టేషన్లు పరిధిలో చట్టానికి విరుద్దంగా నిర్వహిస్తున్నట్లు సీసీబీ పోలీసులకు సమాచారం అందింది.
దీని ఆధారంగా శనివారం రాత్రి పోలీసులు అశోకనగర పోలీస్‌స్టేషన్ పరిధిలోని బ్రిగేడ్‌రోడ్డులో ఉన్న బ్రిగేడ్ హౌస్, బ్రిగేడ్‌నైట్–6 బార్ అండ్ రెస్టారెంట్, కలాసీపాళ్యలో ఉన్న నైట్‌క్వీన్ బార్ అండ్‌రెస్టారెంట్‌పై దాడులు చేశారు. ఈ సమయంలో బ్రీగేడ్Š నైట్–6 బార్ అండ్ రెస్టారెంట్ మేనేజర్ అశోక్‌శెట్టి, క్యాషియర్ సచిన్, నైట్‌క్వీన్ బార్ అండ్ రెస్టారెంట్ పీ.మోహన్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి నగదు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న డ్యాన్స్‌బార్ నిర్వాహకులకోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు అదనపు పోలీస్ కమిషనర్ అలోక్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment