
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల తీరు మరోసారి వివాదాస్పదమైంది. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్ గుంటపల్లి చెరువుతండాకు చెందిన రైతు నునావత్ రాజును సోమవారం పోలీసులు లాఠీ విరిగేలా కొట్టారు. వ్యవసాయ పనులు చేసిన రాజు సాయంత్రం కల్లు తాగి తన ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరాడు. అటుగా వెళ్తున్న వీర్నపల్లి ఎస్‌ఐ నరేశ్‌కుమార్ అతడిని బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించారు. మద్యం తాగినట్లు తేలడంతో సెల్‌ఫోన్ ఇచ్చి వెళ్లాలని ఆదేశించారు. తన వద్ద లేదని చెప్పడంతో ఎస్‌ఐ, సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ లాఠీ విరిగే వరకు కొట్టడంతో కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న గిరిజన సంఘాల నేతలు ఎల్లారెడ్డిపేట సీఐ రవీంరద్‌ను కలసి ఎస్‌ఐపై ఫిర్యాదు చేశారు. నేతలు అజ్మీరా రాజునాయక్, పుణ్యానాయక్, అజ్మీరా తిరుపతినాయక్, రాజయ్య, నునావత్ కైలాసం, సీత్యానాయక్, శంకర్‌నాయక్, ప్రభునాయక్ పోలీసులకు ఫిర్యాదు చేసినవారిలో ఉన్నారు. తమ విధులకు ఆటంకం కల్పించాడంటూ రైతు రాజుపై వీర్నపల్లి పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. సీఐ రవీందర్‌ను సంప్రదించగా, డ్రంకెన్ డ్రైవ్‌లో రాజు మద్యం తాగినట్లు తేలిందని, ఆ సమయంలో అతను పోలీసు విధులకు ఆటకం కల్పిం చాడన్నారు. ఆ తోపులాటలో రాజు కిందపడగా గాయాలయ్యాయని, పోలీసులు కొట్టారనే ఆరోపణలో వాస్తవం లేదని వివరణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment