చెన్నై : తన కోరిక తీర్చనందున మరదల్ని హత్య చేసినట్లు హంతకుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో బుధవారం వెల్లడించాడు. తిరువారూరు జిల్లా, నీడామంగళం సమీపం మేలానవందసేరికి చెందిన జోసెఫ్ రాజశేకరన్ భార్య ఎస్తర్ (25)ను ఆమె భర్త అన్న నెల్సన్ హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి హార్బర్ సముద్రంలో పడేశాడు. అయితే కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈకేసుపై విచారణ జరిపిన పోలీసులు, హంతకుడు నెల్సన్‌ను మంగళవారం అరెస్టు చేసి తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది.
మరదలుపై పుట్టిన దుర్భుద్దితో నెల్సన్ పధకం ప్రకారం ఈనెల ఐదున భార్య పిల్లలను పుట్టింటికి పంపించాడు. ఆరవ తేదీన తల్లి నక్షత్రమేరిని పొలం పనికి పంపించాడు. అనంతరం ఇంట్లో ఒంటరిగా ఉన్న మరదలు ఎస్తర్‌ను తన కోరిక తీర్చమని అడగడంతో ఆమె నిరాకరించింది. అంతేకాకుండా సింగపూర్‌లో ఉన్న తన భర్తకు ఫోన్ చేసి విషయం చెబుతానని, హెచ్చరించింది. దీంతో ఆగ్రహించిన నెల్సన్ తన స్నేహితుడు సహాయరాజ్‌తో కలిసి ఆమెను హత్య చేశాడు. తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికి ప్లాస్టిక్ సంచుల్లో వేసి సముద్రంలో పారేసినట్లు పోలీసులకు తెలిపాడు. ఇలావుండగా ఎస్తర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు గురువారం బంధువులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment