
సాక్షి, బెంగళూరు : నడుస్తున్న బస్సులో ఆకస్మికంగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటన కర్ణాటకలోని హాసన్ వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు... బెంగళూరు నుంచి బైందూరుకు 30 మంది ప్రయాణికులతో బయలుదేరిన ప్రైవేట్ బస్సులో.. ప్రయాణికులు గాఢనిద్రలో ఉండగా ఇంజిన్‌లో మంటలు ఏర్పడ్డాయి. విషయాన్ని గుర్తించిన డ్రైవర్ చాకచక్యంగా రోడ్డుపై బస్సును నిలిపి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురై బస్సు నుంచి బతుకుజీవుడా అంటూ బయటకు పరుగులు తీశారు.
ఈ క్రమంలో కొన్ని క్షణాల్లోనే బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికుల వస్తువులు సైతం కాలిబూడిదయ్యాయి. మరోబస్సులో ప్రయాణికులను బైందూరుకు తరలించారు. కాగా షార్టుసర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment