
సాక్షి, హైదరాబాద్ : అత్యాచారం కేసులో ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రాం రహీమ్ సింగ్ కు శిక్ష పడిన నేపథ్యంలో దేశంలో పలుచోట్ల స్వాముల బాగోతాలు వెలుగుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దత్త పీఠం అధిపతిపై అత్యాచారం కేసు నమోదైంది. తనపై అత్యాచారయత్నం చేశాడంటూ దత్త పీఠం అధిపతి శ్రీరామశర్మపై ఓ భక్తురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పీఠం అధిపతి శ్రీరామ్‌శర్మపై నాచారం పోలీసులు కేసు నమోదు చేశారు.
అంతేగాక పూజల పేరుతో లక్షల రూపాయలు తన వద్ద నుంచి వసూలు చేశాడని బాధితురాలు ఆరోపించారు. రామ్‌శర్మపై 354, 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. అయితే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఆధ్యాత్మిక వేత్తపై ఇలాంటి కేసు నమోదవడం స్థానికంగా కలకలం రేపుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.