PEETHAM
-
రాజ శ్యామల అమ్మవారి దీక్ష పీఠం వద్ద పూజలో సీఎం జగన్
-
శారదా పీఠంలో సీఎం జగన్ ప్రత్యేక పూజలు
-
విశాఖ శారదా పీఠంలో సీఎం జగన్ పూజలు
-
విశాఖ శారద పీఠానికి సీఎం వైఎస్ జగన్
-
'పూజల పేరుతో ఆయిల్ మసాజ్‌లు'
సాక్షి, హైదరాబాద్ : దత్త పీఠం అధిపతి శ్రీరామ్ శర్మ తాంత్రిక పూజలతో తనను చీటింగ్ చేసినట్టు ఓ మహిళ ఆరోపించింది. బార్ అండ్ రెస్టారెంట్లలో నష్టం రావడతో పూజలు చేస్తే లాభాలు వస్తాయని నమ్మించాడని తెలిపింది. పూజల పేరుతో ఆయిల్ మసాజ్‌లు చేసి మోసం చేశాడని.. పూజలు పేరుతో నన్ను వేధించాడని తెలిపింది. ' నా దగ్గర నుంచి రూ. 40 లక్షలు దండుకున్నాడు. గతంలో ఓ చీటింగ్ కేసులో నన్ను బాధ్యురాలుని చేసి జైలుకి పంపాడు. ఇపుడు కేసు వెనక్కి తీసుకోవాలని, పోలీసులు, రాజకీయ నేతలు తెలుసంటూ బెదింపులకు దిగాడు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లోని ఓ ఎస్ఐ కేసు వెనక్కి తీసుకోవాలని నాపై ఒత్తిడి తెచ్చాడు. శ్రీరామ్ శర్మ చాలా మంది యువతులను మోసం చేశాడు. నాకు ఎలాంటి ప్రమాదం జరిగినా రామ్ శర్మదే బాధ్యత' అని తెలిపింది. కాగా తనపై అత్యాచారయత్నం చేశాడంటూ శ్రీరామశర్మపై భక్తురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శ్రీరామ్‌శర్మపై నాచారం పోలీసులు కేసు నమోదు చేశారు. రామ్‌శర్మపై 354, 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. అయితే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఆధ్యాత్మిక వేత్తపై ఇలాంటి కేసు నమోదవడం స్థానికంగా కలకలం రేపుతోంది. -
'పూజల పేరుతో ఆయిల్ మసాజ్‌లు'
-
భక్తురాలిపై అత్యాచారయత్నం: పీఠాధిపతిపై కేసు!
సాక్షి, హైదరాబాద్ : అత్యాచారం కేసులో ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రాం రహీమ్ సింగ్ కు శిక్ష పడిన నేపథ్యంలో దేశంలో పలుచోట్ల స్వాముల బాగోతాలు వెలుగుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దత్త పీఠం అధిపతిపై అత్యాచారం కేసు నమోదైంది. తనపై అత్యాచారయత్నం చేశాడంటూ దత్త పీఠం అధిపతి శ్రీరామశర్మపై ఓ భక్తురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పీఠం అధిపతి శ్రీరామ్‌శర్మపై నాచారం పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేగాక పూజల పేరుతో లక్షల రూపాయలు తన వద్ద నుంచి వసూలు చేశాడని బాధితురాలు ఆరోపించారు. రామ్‌శర్మపై 354, 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. అయితే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఆధ్యాత్మిక వేత్తపై ఇలాంటి కేసు నమోదవడం స్థానికంగా కలకలం రేపుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
గురుమార్గం ఉత్తమం
అయిభీమవరం (ఆకివీడు) : గురుమార్గం మానవుడికి సన్మార్గమని కంచి కామకోటి పీఠాధిపతి శంకర జయేంద్ర సరస్వతి అన్నారు. అయిభీమవరంలోని టీటీడీ బోర్డు మాజీ చైర్మ¯ŒS కనుమూరి బాపిరాజు నివాసంలో సోమవారం ఆయన బస చేశారు. ఈ సందర్భంగా కంచి పీఠాధిపతులు అయిభీమవరం గ్రామం సందర్శించినప్పటి చిత్రాలను బాపిరాజు ఆయనకు చూపించారు. గురుపూజ చేయడం ద్వారా ప్రతి మనిషి సన్మార్గంలో నడుస్తాడని స్వామీజీ అన్నారు. షష్ఠి పండగను అమృత లింగేశ్వరస్వామి ఆలయంలో జరుపుకునే భాగ్యం దక్కిందన్నారు. పురాతన ఆలయాల్ని తక్షణం పునర్నిర్మించాలని సూచించారు. ఆలయాలు వైభవంగా ఉంటేనే గ్రామం సుభీక్షంగా ఉంటుందని చెప్పారు.