
దత్త పీఠం అధిపతి శ్రీరామ్ శర్మ తాంత్రిక పూజలతో తనను చీటింగ్ చేసినట్టు బాధితురాలు తెలిపింది.
సాక్షి, హైదరాబాద్ : దత్త పీఠం అధిపతి శ్రీరామ్ శర్మ తాంత్రిక పూజలతో తనను చీటింగ్ చేసినట్టు ఓ మహిళ ఆరోపించింది. బార్ అండ్ రెస్టారెంట్లలో నష్టం రావడతో పూజలు చేస్తే లాభాలు వస్తాయని నమ్మించాడని తెలిపింది. పూజల పేరుతో ఆయిల్ మసాజ్‌లు చేసి మోసం చేశాడని.. పూజలు పేరుతో నన్ను వేధించాడని తెలిపింది. ' నా దగ్గర నుంచి రూ. 40 లక్షలు దండుకున్నాడు. గతంలో ఓ చీటింగ్ కేసులో నన్ను బాధ్యురాలుని చేసి జైలుకి పంపాడు. ఇపుడు కేసు వెనక్కి తీసుకోవాలని, పోలీసులు, రాజకీయ నేతలు తెలుసంటూ బెదింపులకు దిగాడు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లోని ఓ ఎస్‌ఐ కేసు వెనక్కి తీసుకోవాలని నాపై ఒత్తిడి తెచ్చాడు. శ్రీరామ్ శర్మ చాలా మంది యువతులను మోసం చేశాడు. నాకు ఎలాంటి ప్రమాదం జరిగినా రామ్ శర్మదే బాధ్యత' అని తెలిపింది.
కాగా తనపై అత్యాచారయత్నం చేశాడంటూ శ్రీరామశర్మపై భక్తురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శ్రీరామ్‌శర్మపై నాచారం పోలీసులు కేసు నమోదు చేశారు. రామ్‌శర్మపై 354, 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. అయితే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఆధ్యాత్మిక వేత్తపై ఇలాంటి కేసు నమోదవడం స్థానికంగా కలకలం రేపుతోంది.