![Road Accident At Garikapadu Check Post In Jaggayyapeta - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/3/died.jpg.webp?itok=1UodYikv)
సాక్షి, కృష్ణా : జిల్లాలోని జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న ఓ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతులను తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా చెందిన నారపోగు గోపయ్య, షేక్ మన్సూర్, మట్టపల్లి భీంరెడ్డి, పోతుల భీం రెడ్డి ,విస్రం కోటేశ్వరరావు లుగా గుర్తించారు. మృతుల బంధువులకు ఏపీ పోలీసులు సమాచారం అందించారు. అయితే అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment