jaggayyapeta
-
జగన్ అంటే అంతులేని ప్రేమ
-
బూదవాడ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఉద్రిక్తత
-
ఏపీలో డయేరియా కలకలం.. 10 మంది మృతి
-
అప్పుడు నానా హడావుడి.. ఇప్పుడు మౌనం
రాష్ట్రంలోనే అత్యధికంగా పోలింగ్ నమోదైన నియోజకవర్గాల్లో ఉమ్మడి ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట కూడా ఉంది. పోలింగ్ పెరుగుదల అంతా తమ కోసమే అంటూ తెలుగుతమ్ముళ్లు ఆ రోజున తెగ సంబరాలు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత ఎక్కడెక్కడ ఏవిధంగా పోలింగ్ జరిగిందో..ఏ వర్గం ఎవరికి అనుకూలంగా ఉందో ఒక అంచనాకు వచ్చారు. దీంతో పచ్చ పార్టీనేతలకు నోట మాట పడిపోయింది. జగ్గయ్యపేటలో చేతులెత్తేయడం ఖాయం అంటూ టీడీపీలో టాక్ నడుస్తోంది. జగ్గయ్యపేట పోలింగ్ సరళి ఎలా ఉందో చూద్దాం.ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ కచ్చితంగా గెలిచి తీరాలనుకున్న నియోజకవర్గాల్లో జగ్గయ్యపేట ఒకటి. అందుకు ప్రధాన కారణం జగ్గయ్యపేటలో మూడుసార్ల నుంచి గెలుస్తూ వస్తున్న ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వల్ల పచ్చ పార్టీ అడ్రస్ గల్లంతయ్యే ప్రమాదం ఉందని భావించడమే. ఇప్పటికి మూడుసార్లు గెలిచిన ఉదయభాను...నాలుగోసారి కూడా బరిలో నిలిచారు. ఈసారి కూడా ఉదయభాను గెలిస్తే జగ్గయ్యపేట నుంచి ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిచిన నాయకుడిగా రికార్డ్ సాధించడం ఒక భాగం అయితే ... జగ్గయ్యపేటలో టీడీపీ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోవడం ఖాయం అని భయపడుతున్నారట. ఈ కారణంగానే ఎలాగైనా గెలవాల్సిందేనని టీడీపీ గట్టి పట్టుదల చూపించింది. అందుకే చంద్రబాబు మొదటి విడతలోనే జగ్గయ్యపేట అభ్యర్థిగా శ్రీరామ్ రాజగోపాల్ ఉరఫ్ తాతయ్య పేరు ప్రకటించేశారు.శ్రీరాం రాజగోపాల్ పేరు ప్రకటించినప్పటినుంచీ వైఎస్ఆర్సీపీ ఓట్లకు గండి కొట్టడం ఎలా అనే ఆలోచించడం ప్రారంభించారు. సామినేని ఉదయభానును ఓడించి తాను గెలవడం ఎలా అంటూ రకరకాల ప్రయత్నాలు చేశారు. ప్రచారం కూడా బాగానే చేశారు. ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాలకు ప్రజలు పోటెత్తారు. పోలంగ్ కేంద్రాలు తెరవకముందే వచ్చి క్యూల్లో నిలుచున్నారు. రాత్రి వరకు బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో పోలింగ్ భారీ నుంచి అతి భారీ స్థాయికి చేరింది. రాష్ట్రంలో అత్యధికంగా పోలింగ్ నమోదైన టాప్ త్రీ నియోజకవర్గాల సరసన జగ్గయ్య పేట కూడా చేరింది.జగ్గయ్యపేట నియోజకవర్గంలో మొత్తం 2,05,364 మంది ఓటర్లు ఉండగా వారిలో 1,84,575 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పురుషుల కంటే 7,237 మంది మహిళలు అధికంగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాలకు భారీగా ఓటర్లు తరలిరావడాన్ని చూసిన తెలుగు తమ్ముళ్లు ఈసారి తమదే విజయం పక్కా..అదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటే అని సంబరాలు చేసుకున్నారు. కుప్పంతో సమానంగా 89.88 శాతం పోలింగ్ నమోదు కావడంతో టీడీపీ క్యాడర్లో సంతోషం అంతా ఇంతా కాదు..శ్రీరాం రాజగోపాల్ విజయం ఖాయం అని ఒకరికొకరు చెప్పుకున్నారు. కట్ చేస్తే...తెల్లారాక అసలు విషయాలు తెలిసి కళ్లు తేలేస్తున్నారు.నియోజకవర్గంలో జరిగిన అత్యంత భారీ పోలింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని..అదంతా వైఎస్ జగన్ ప్రభుత్వానికి అనుకూలమని లెక్కలు తేలడంతో టీడీపీ వారికి నోట మాట రావడంలేదు. జగ్గయ్యపేట టౌన్ మినహా ఇతర అన్ని మండలాల్లోనూ 90 శాతానికి పైగా నమోదైన పోలింగ్ టీడీపీకి అనుకూలంగా లేదని వారికి అర్థమైపోయింది. ప్రజలు ఏ పార్టీకి మొగ్గు చూపించారో అర్థం అయ్యాక టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఏమి మాట్లాడాలో అర్థం కావడంలేదట. అందుకే ఎన్నికల ముందు గెలుస్తాం అంటూ నానా హడావుడి చేసినవారంతా ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు. -
సాధికార యాత్రకు పోటెత్తిన జనం
-
చంద్రబాబు చేసింది కీడా? మేలా?.. అసలు కథ ఇప్పుడే మొదలైంది!
తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న నియోజకవర్గం అది. అభ్యర్ధి ఎవరైనా సరే క్యాడర్ అంతా కలిసి గెలిపించుకునేవారు. కాని గత ఎన్నికల్లో పరిస్థితి తిరగబడింది. సైకిల్‌ను ముక్కలు చేసి మూలకు విసిరేశారు అక్కడి ప్రజలు. ఇప్పుడు ఆ ముక్కల్ని అతికించుకోవడానికి సైకిల్ పార్టీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. అధినేత అభ్యర్థిని ప్రకటించినా.. ఓ కమ్మ నేత టిక్కెట్ మాకే ఇవ్వాలంటూ పార్టీకి అల్టిమేటమ్ ఇచ్చారట. జగ్గయ్యపేట తమ్ముళ్ల క్యాస్ట్ పాలిటిక్స్ మీరే చదవండి. కులం చుట్టూ రాజకీయం ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి పెట్టనికోటలా ఉండేది. టీడీపీ కేడర్ గతంలో కులం చూడకుండా అభ్యర్థి ఎవరైనా కలిసికట్టుగా పనిచేసేవారు. కాని నాలుగేళ్ళుగా అక్కడ క్యాస్ట్ పాలిటిక్స్ పీక్స్‌కు చేరాయంటున్నారు. ప్రస్తుతం జగ్గయ్యపేటకు మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ టీడీపీ ఇంఛార్జిగా కొనసాగుతున్నారు. నాలుగేళ్లుగా పార్టీ కార్యక్రమాలన్నింటినీ తన భుజాన వేసుకుని నిర్వహిస్తున్నారు. అయితే ఏడాది క్రితం చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన బొల్లా రామకృష్ణ జగ్గయ్యపేట పాలిటిక్స్‌లోకి ఎంటరయ్యారట. అప్పట్నుంచి అక్కడి టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయిందట. నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు కీలకం కాబట్టి టిక్కెట్ తనకే వస్తుందని బొల్లా రామకృష్ణ ప్రచారం చేసుకుంటున్నారు. ఈయన లోకేష్‌కు సన్నిహితుడు కావడం, ఆర్ధికంగా బలమైన వ్యక్తి కావడంతో బొల్లా ఏడాది నుంచి సెపరేటుగా కార్యక్రమాలు చేసుకుంటున్నాడు. ఆ మధ్య చంద్రబాబు జగ్గయ్యపేట వచ్చినపుడు బొల్లా, శ్రీరాం రాజగోపాల్ వేరువేరుగా ఏర్పాటు చేసుకున్న బ్యానర్లు పార్టీలో పెద్ద రచ్చ రాజేశాయట. జగ్గయ్యపేట సీటు తనదంటే తనదని ఇద్దరూ కొట్టుకుంటున్న సమయంలో.. శ్రీరాం రాజగోపాల్‌ను ఆశీర్వదించాలంటూ తన పర్యటనలో చంద్రబాబు బహిరంగంగానే ప్రకటించేశారు. చంద్రబాబు ప్రకటనతో తన లైన్ క్లియర్ అయ్యిందని శ్రీరాం రాజగోపాల్ సంతోష పడుతున్నప్పటికీ అసలు ముసలం ఇక్కడ్నుంచే మొదలైందట. జగ్గయ్యపేట నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టిన నెట్టెం రఘురామ్ ప్రస్తుతం టీడీపీ విజయవాడ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. నను చంద్రబాబు ఒక్క మాటైనా అడగకుండానే శ్రీరాం రాజగోపాల్ ను జగ్గయ్యపేట అభ్యర్ధిగా ప్రకటించడంపై మూడు నెలలుగా నెట్టెం రగిలిపోతున్నాడట. మొన్నటి వరకూ శ్రీరాం రాజగోపాల్‌కు అండగా ఉన్న నెట్టెం ఇప్పుడు తన సామాజికవర్గానికి చెందిన బొల్లాకు మద్దతుగా నిలుస్తున్నారట. ఈసారి కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతకు టిక్కెట్టు ఇప్పించాలనుకుంటున్న తరుణంలో చంద్రబాబు తమ ఆశల పై నీళ్లు చల్లడాన్ని తట్టుకోలేకపోతున్నారట . అధిష్టానం నిర్ణయం మార్చుకుంటే సరేసరి లేకపోతే యుద్ధమే అంటున్నారట. మరోవైపు శ్రీరాం రాజగోపాల్ ను ఒంటిరిని చేసి... బొల్లా రామకృష్ణతో నెట్టెం చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారట. పాతాళానికి ప్రతిష్ట కమ్మ సామాజికవర్గ నేతకు కాకుండా శ్రీరాం రాజగోపాల్ కు సీటు ఇస్తే ఒప్పుకునేదే లేదని..అతనికి సహకరించేదే లేదని నెట్టెం రఘురాం తేల్చేశారట. ఇదే సమయంలో బొల్లా రామకృష్ణ పార్టీలో ఉన్న ముఖ్యనేతలను, క్యాడర్ ను తనవైపుకు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారట. కుల బలంతో పాటు క్యాడర్ అండ కూడా ఉందని అధిష్టానం ముందు బలప్రదర్శన చేయాలనే ఆలోచనలో ఉన్నారట బొల్లా. ఐతే టీడీపీ పెట్టిన నాటి నుంచి నియోజకవర్గంలో లేని క్యాస్ట్ పాలిట్రిక్స్ ను ఇప్పుడు చూసి జగ్గయ్యపేట తమ్ముళ్లు తల బాదుకుంటున్నారట. ఓవైపు చంద్రబాబేమో గెలిచేది మనమే ... వచ్చేది మనమే అని డబ్బా కొడుతుంటే ... జగ్గయ్యపేట నేతలేమో ఇలా కులం పేరుతో కొట్టుకోవడం పట్ల పార్టీలోనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో పవన్ అభిమానుల అత్యుత్సాహం
-
జగ్గయ్య పేటలో పవన్ అభిమానుల అత్యుత్సాహం
ఎన్టీఆర్ జిల్లా: జిల్లాలోని జగ్గయ్యపేటలోని ఓ థియేటర్లో పవన్ కల్యాణ్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సినిమా థియేటర్లో భోగి మంట వేసి అలజడి రేపారు. డిసెంబర్ 31వ తేదీన ఖుషీ సినిమా ప్రదర్శన సమయంలో థియేటర్లో అభిమానులు భోగి మంటలు వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సినిమా ప్రదర్శన సమయంలో ధియేటర్ లోనే పేపర్లతో మంటలు వేశారు పవన్ అభిమానులు. స్క్రీన్ దగ్గర మంటలు వేసి డాన్సులు చేశారు. థియేటర్లో మంట ఎందుకు వేసారని ప్రశ్నించిన యజమానిపై పవన్ కల్యాణ్ అభిమానులు దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనపై థియేటర్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
చెరువులో చేపల మేత వేస్తూ..
జగ్గయ్యపేట: చేపల చెరువులో పడవ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామంలో శనివారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీల ఆధ్వర్యంలో సాగవుతున్న చేపల చెరువు రక్షణకు ఒంగోలుకు చెందిన మేడా వెంకట్రావ్ (27), భార్య, ఇద్దరు పిల్లలతో కాపలాదారునిగా ఉంటున్నాడు. శనివారం మధ్యాహ్న సమయంలో అదే గ్రామానికి చెందిన వల్లెపు ప్రవీణ్ (22) కూలీ పనుల్లో భాగంగా చెరువు వద్దకు వెళ్లాడు. కాపలాదారు వెంకట్రావ్, ప్రవీణ్ చేపలకు మేత వేసేందుకు ఒడ్డునున్న ఇనుప రేకు పడవతో చెరువులోకి వెళ్లి మేత వేస్తుండగా.. ఒక్కసారిగా పడవ మునిగిపోయింది. దీంతో ఒడ్డున ఉన్న భార్యా, పిల్లలు కేకలు వేయడంతో సమీపంలోని పంట పొలాల్లో ఉన్న కూలీలు పరుగున వచ్చారు. చెరువులో పైకి తేలిన వెంకట్రావ్‌ను 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. అప్పటికి ప్రవీణ్ ఆచూకీ లభించలేదు. చిల్లకల్లు ఎస్ఐ చిన్నబాబు సిబ్బందితో వచ్చి ప్రవీణ్ కోసం గాలించగా.. మృతదేహం లభ్యమైంది. ఇద్దరు మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, వెంకట్రావు తండ్రి ఇదే చెరువుకు కాపలాదారుడిగా ఉంటూ గతేడాది గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో వెంకట్రావ్ ఏడాదిగా చెరువుకు కాపలాదారుడిగా ఉంటున్నాడు. -
25 ఏళ్ల తరువాత కుటుంబం చెంతకు..
జగ్గయ్యపేట అర్బన్: మతి స్థిమితం కోల్పోయి భార్యా బిడ్డలకు దూరమై అనాథగా జీవిస్తున్న ఓ వృద్ధుడు 25 ఏళ్ల తరువాత తిరిగి కుటుంబం చెంతకు చేరుకున్నాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో చోటుచేసుకుంది. స్థానిక చెరువు బజారుకు చెందిన మణిమాల వెంకట్రావు(70) ముఠా కార్మికుడిగా జీవించేవాడు. అతనికి భార్య వెంకాయమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకట్రావుఒకరోజు అతిగా మద్యం తాగి మతి స్థిమితం కోల్పోయాడు. ఇంటికి చేరుకోలేక తిరిగి తిరిగి చివరకు తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని వృద్ధాశ్రమానికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు అతని కోసం కొన్నాళ్లపాటు వెతికి ఆశలు వదులుకున్నారు. ఇలా 25 ఏళ్లు గడిచిపోయాయి. ఇటీవల వెంకట్రావుకు పాత జ్ఞాపకాలు గుర్తుకు రావడంతో తోటి వారితో తన ఊరు, కుటుంబ సభ్యుల పేర్లు చెప్పగలిగాడు. దీంతో వృద్ధాశ్రమం నిర్వాహకులు జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి వెంకట్రావు వివరాలు చెప్పారు. జగ్గయ్యపేట ఎస్ఐ రామారావు వెంటనే విచారణ చేసి స్థానిక చెరువుబజారులో వెంకట్రావు కుటుంబ సభ్యులు ఉన్నారని తెలుసుకొని, సమాచారమిచ్చారు. రంపచోడవరంలోని వృద్ధాశ్రమంలో ఉన్న వెంకట్రావును అక్కడి పోలీసుల సహాయంతో జగ్గయ్యపేటకు తీసుకొచ్చారు. ఆదివారం జగ్గయ్యపేట పోలీస్‌స్టేషన్‌లో వెంకట్రావును అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
అమ్మా కృష్ణవేణి వస్తే నా శవాన్ని ముట్టకోనివ్వద్దు..
సాక్షి, జగ్గయ్యపేట: కట్టుకున్న భార్య ప్రవర్తన నచ్చక ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. మండలంలోని మిట్టగూడెంనకు చెందిన ఆళ్ల వెంకటేశ్వరరావు (25) బైక్ మెకానిక్‌గా జీవిస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం రాచేపల్లికి చెందిన కృష్ణవేణితో అతనికి వివాహమైంది. కొన్నేళ్ల పాటు సజావుగానే ఉన్నా ఇటీవల ఆమె మరొక వ్యక్తికి విహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తి ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లి అక్కడే భర్తపై కేసు పెట్టింది. అయితే పెద్దలు రాజీచేసి ఆమెను కాపురానికి పంపించారు. రెండు, మూడు రోజుల క్రితం భార్య మళ్లీ పుట్టింటికి వెళ్లగా ఆమె ప్రవర్తన నచ్చక రాత్రి తొమ్మిది గంటల సమయంలో తాను పనిచేస్తున్న షెడ్డులోనే వెంకటేశ్వరరావు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు అతను కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ‘అమ్మా నన్ను క్షమించు. ఇక నీతో మాట్లాడలేనమ్మా. ఇవే నా ఆఖరి మాటలమ్మా. నేను చచ్చిపోతున్నాను. మీరు నా గురించి ఆగం కావద్దు. ఇద్దరు తమ్ముళ్లను మంచిగా చూసుకుంటూ ఆనందంగా ఉండండమ్మా. మీరు సంతోషంగా ఉంటే చాలమ్మా. చదవండి: (ఒంటరి మహిళలే టార్గెట్: అదే కిరణ్ ప్రత్యేకత) నా జీవితంలో కష్టం తప్ప ఏ నాడూ సుఖపడలేదమ్మా. మీ అందరినీ వదిలిపెట్టి పోవాలని లేదు. అన్ని విధాలా మోసపోయాను. నేను చనిపోయిన తరువాత కృష్ణవేణి వస్తే నా శవాన్ని ముట్టకోనివ్వద్దు. నా చేతిపై ఆమె పేరు ఉంది. దానిని తీసేసి దహనం సంస్కారాలు చేయండి’ అని కన్నీటి పర్యంతమై ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. మృతుడి తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు ఎస్ఐ–2 రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆస్తులకు సర్కారు భరోసా
తల్లికి బిడ్డ.. రైతుకు భూమి బిడ్డ మీద తల్లికెంత మమకారం ఉంటుందో భూమిపై రైతుకు కూడా అంతే మమకారం ఉంటుంది. భూమి రైతు కుటుంబానికి ప్రాణ సమానం. ప్లాటు అయినా, ఇల్లు అయినా, వ్యవసాయ భూమి అయినా వివాదంలో ఇరుక్కుంటే అసలు యజమాని పరిస్థితి ఎలా ఉంటుందో నా పాదయాత్రలో కళ్లారా చూశా. గట్టు జరిపి ఒక రైతు భూమిని మరొకరు ఆక్రమిస్తే ఆ రైతన్న ఎంత క్షోభకు గురవుతారో మనకు తెలుసు. రాబందుల్లాంటి మనుషులు దొంగ రికార్డులు సృష్టించి భూములు కొట్టేయాలని స్కెచ్ వేస్తే చట్టపరంగా పోరాడే శక్తి లేని కుటుంబాల పరిస్థితి ఏమిటని మనమంతా ఆలోచించాలి. మార్చాలా వద్దా..? మీ ఆస్తికి మిమ్మల్నే అసలైన యజమానిగా ధ్రువీకరించే వ్యవస్థ ఉండాలా? వద్దా? మీ ఆస్తి రికార్డులు పదిలంగా ఉండాలా? వద్దా? మీ ఆస్తిని వేరెవరికో అమ్మేసే అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలా? వద్దా? మీ ఆస్తికి సంబంధించిన సరిహద్దులు, కొలతలు, అంగుళాలతో సహా కచ్చితంగా నిర్ధారణ చేయాలా? వద్దా? మీ భూమి కొలత ఏమిటో, అది ఏ ఆకారంలో ఉందో, రికార్డుల్లో కనిపించాలా? వద్దా? గిట్టని వారో, కబ్జారాయుళ్లో రాళ్లు పీకేసినా, గట్టు చెదరగొట్టినా చెక్కు చెదరని పత్రాలు, ఆధారాలు మీ దగ్గర, ప్రభుత్వం దగ్గర ఉండాలని మీరు కోరుకుంటున్నారో? లేదో ఒక్కసారి ఆలోచించండి. – జగ్గయ్యపేట బహిరంగ సభలో సీఎం జగన్ సాక్షి, అమరావతి: ప్రజల ఆస్తులకు భరోసా కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే ప్రాజెక్టు దేశానికే రోల్ మోడల్ కానుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి సంపాదించిన ఆస్తులు వివాదంలో చిక్కుకుంటే ఆ కుటుంబాలు పడే మానసిక వేదన మాటలకందనిదని, ఇలా ఎవరికీ జరగకూడదనే సంకల్పంతో స్థిరాస్తులపై యజమానులకు శాశ్వత హక్కులు కల్పించాలని నిర్ణయించామని ప్రకటించారు. సోమవారం కృష్ణా జిల్లా తక్కెళ్లపాడులో సర్వే రాయి వేసి ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం’ (రీ సర్వే) ప్రారంభించిన అనంతరం జగ్గయ్యపేటలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్, ఎంపీ మోపిదేవి వెంకట రమణ, ప్రభుత్వ విప్ ఉదయబాను, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రసంగం వివరాలివీ.. జగ్గయ్యపేట సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పవిత్ర సంకల్పంతో సర్వేకు శ్రీకారం.. భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలంటే రికార్డులు పక్కాగా ఉండాలి. భూముల రికార్డులు దోషరహితంగా ఉంటే కోర్టుల చుట్టూ తిరగాల్సిన తిప్పలు ఉండవు. మీ ఆస్తులకు మనందరి ప్రభుత్వం హామీగా ఉంటుందని మాట ఇస్తూ ‘వైఎస్సార్ జగనన్న భూహక్కు – భూరక్ష కార్యక్రమం’ ఇక్కడ నుంచే ప్రారంభిస్తున్నాం. దీనిద్వారా మీ పిల్లలు, వారసులకు మోసాలకు తావులేని విధంగా ఆస్తులపై హక్కులు కల్పిస్తాం. ఇందుకోసమే మొన్న అసెంబ్లీలో ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని ఆమోదించాం. పవిత్ర సంకల్పంతో సర్వే ప్రారంభిస్తున్నాం. వందేళ్లలో ఎన్నో మార్పులు.. వందేళ్లలో దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయి. పాలకులు మారిపోయారు. స్వాతంత్య్రం వచ్చింది. రాజ్యాంగం, చట్టాలు, హక్కులు వచ్చాయి. ఒకప్పుడు రేడియో కూడా లేని గ్రామాలు ఉండేవి. ఇవాళ స్మార్ట్ ఫోన్ లేని మనిషి ఎక్కడున్నాడా? అని వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇంత మారినా 1920లో బ్రిటీష్ హయాం తరువాత ఇప్పటి వరకూ భూముల రీసర్వే జరగలేదు. పరిస్థితిని పూర్తిగా మార్చేందుకే.. రాష్ట్రంలో కొందరికి రికార్డుల్లో భూమి ఒక చోట ఉంటే అనుభవిస్తున్న భూమి మరో చోట ఉంది. సబ్ డివిజన్ సమస్యలున్నాయి. ఇలాంటి సమస్యలన్నీ పరిష్కరిస్తూ భూతద్దంతో వెతికినా ఒక్క పొరపాటు కూడా లేకుండా సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత ఆస్తి హక్కు పత్రం యజమానులకు ఇస్తాం. మిల్లీమీటర్లతో సహా కొలిచి మ్యాపు కూడా ఇస్తాం. ప్రతి రెవెన్యూ విలేజ్ పరిధిలో విలేజ్ మ్యాప్ ఉంటుంది. ప్రతి ఒక్కరి భూమికి ఆధార్ నెంబర్ మాదిరిగా యూనిక్ ఐడీ నెంబర్ కేటాయిస్తాం. ఆ నెంబర్‌తో భూమి ఎక్కడ ఉందో, సరిహద్దులు ఏమిటో సర్వే ద్వారా అంగుళాలతో సహా నిర్ధారణ అవుతుంది. అభ్యంతరాల స్వీకరణ కోసం గ్రామ/ వార్డు సచివాలయాల్లో పొందుపరిచి అనంతరం భూ యజమానికి శాశ్వత టైటిల్ ఇస్తాం. సర్వే పూర్తయిన గ్రామాల్లో సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ సేవలు కూడా ప్రారంభిస్తాం. ప్రజలపై పైసా భారం ఉండదు.. ప్రజలపై పైసా కూడా భారం మోపకుండా మొత్తం సర్వే ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తుంది. రాళ్ల ఖర్చు కూడా భరిస్తుంది. సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ, సర్వే డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల భాగస్వామ్యంతో రూ.1,000 కోట్ల వ్యయంతో ఈ పవిత్ర యజ్ఞం సాగుతుంది. 4,500 సర్వే బృందాలతో 17,600 రెవెన్యూ గ్రామాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మూడు దశల్లో సర్వే నిర్వహిస్తాం. 2023 నాటికి చివరి వార్డు, గ్రామంలో కూడా ఈ సర్వేను పూర్తి చేస్తాం. కబ్జాలతో కోట్లకు పడగ పరుల సొమ్ము పాము లాంటిదని పెద్దలు చెబుతారు. కబ్జా భూములతో కోట్లకు పడగెత్తాలనే దుర్మార్గమైన ఆలోచన చేసే వాళ్లు ఇవాళ ఉన్నారు. నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ఇలాంటి ఘటనలు ఎన్నో విన్నా. ఇలాంటి అన్యాయం ఏ ఒక్కరికీ జరగరాదు. ప్రజలందరికీ మేలు చేయాలనే ఆరాటం, తాపత్రయంతోనే వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకానికి శ్రీకారం చుట్టాం. సమన్వయం లేక... ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేక భూ వివాదాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ఆదాయం వస్తోందని రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్లు చేస్తోంది. ఆస్తిని అమ్ముతున్న వారు నిజమైన యజమానా? కాదా అనే ప్రశ్న లేకుండానే గతంలో రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. ఒకే భూమిని ఇద్దరు ముగ్గురికి విక్రయించిన సందర్భాలను చూస్తున్నాం. నష్ట పరిహారం హామీ కూడా.. ఎక్కడైనా ల్యాండ్ టైట్లింగ్ చట్టం ద్వారా హక్కు పత్రాలు పొందిన వారికి ఆస్తిపై హక్కు లేదని తేలితే ప్రభుత్వమే నష్ట పరిహారం చెల్లిస్తుందనే హామీ ఇస్తున్నాం. ఇటువంటి చట్టం దేశ చరిత్రలో ఎక్కడా లేదు. మన రాష్ట్రం దీనికి మొట్టమొదటిగా నాంది పలుకుతోంది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎవరైనా భూములను ఎలాంటి భయం లేకుండా నిశ్చింతగా కొనుక్కోవచ్చు. ఏపీలో మొదలైన ఈ విప్లవాత్మక కార్యక్రమం దేశమంతా ప్రభావం చూపుతుంది. వ్యవస్థలో నిజాయితీ తెస్తామనే మాటకు కట్టుబడి అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ ద్వారా 18 నెలల్లో ఈ దిశగా ముందడుగు వేశామని మీ బిడ్డగా గర్వంగా చెబుతున్నా. దేశంలోనే అతిపెద్ద రీ సర్వే ప్రారంభం దేశంలోనే అతి పెద్ద రీ సర్వే ఏపీలో ప్రారంభమైంది. కృష్ణా జిల్లాలోని తక్కెళ్లపాడులో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష’ పైలట్ ప్రాజెక్టు కింద రీ సర్వే పూర్తయిన కృష్ణా జిల్లా తక్కెళ్లపాడులో రైతులు, స్థిరాస్తి యజమానులకు సీఎం స్వయంగా హక్కు పత్రాలను అందజేశారు. తక్కెళ్లపాడు ట్రై జంక్షన్లో పూజలు నిర్వహించి శాస్త్రోక్తంగా సర్వేరాయి నాటిన అనంతరం మీట నొక్కి డ్రోన్లను గాలిలోకి పంపించారు. ఆధునిక విధానంలో రూపొందించిన సర్వే మ్యాపు (గ్రామపటాన్ని) పరిశీలించారు. సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ, సర్వే సెటిల్మెంట్, స్టాంపులు, రిజిస్ట్రేషన్, పురపాలక, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల స్టాళ్లను తిలకించారు. సర్వే సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డుల విభాగం స్టాల్లో ప్రదర్శించిన 1866 నాటి రీసర్వే సెటిల్మెంట్ రిజిష్టర్, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ (ఎఫ్ఎంబీ)లను సీఎం పరిశీలించారు. సర్వే ఆఫ్ ఇండియా స్టాల్లో ఆధునిక పద్ధతుల గురించి సంస్థ డీజీ గిరీష్‌కుమార్ వివరించారు. -
భార్యతో కలిసి అత్తమామల ఉసురు తీశాడు..
బండిపాలెం(జగ్గయ్యపేట): కట్నం ఇవ్వలేదని అత్తమామల గొంతుకోశాడో వ్యక్తి. భార్యతో కలిసి నిలువునా వారి ప్రాణాలు బలిగొన్నాడు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెంలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. కోట ముత్తయ్య (63) సుగుణమ్మ (58) కూలీలు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు సుందర్రావు ప్రైవేట్ ఉద్యోగి. కుమార్తె మనీష, ఇంటి పక్కనే ఉంటున్న బాబురావులు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. కట్నకానుకల విషయంలో తేడా రావడంతో పెళ్లి ప్రస్తావన ఆగిపోయింది. అయితే నాలుగు నెలల కిందట బాబురావు, మనీషలు వివాహం చేసుకున్నారు. తమకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారంటూ బాబురావు కుటుంబ సభ్యులు వారిని ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో వారు అద్దె ఇంట్లో ఉంటున్నారు. కొద్ది రోజులుగా కట్నం విషయంలో బాబురావుకు, అత్తమామలకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్య కూడా భర్తకు మద్దతుగా నిలిచేది. ఈ నేపథ్యంలో ముత్తయ్య, సుగుణమ్మలను అంతమొందించాలని బాబురావు, మనీషలు పథకం రచించారు. మంగళవారం రాత్రి మనీష తన తల్లి ఇంటికి పడుకునేందుకు వచ్చింది. రాత్రి 12 గంటల సమయంలో బాబురావు కూడా కత్తితో వచ్చాడు. అప్పటికే గాఢ నిద్రలో ఉన్న అత్తమామల గొంతును భార్య సాయంతో కోశాడు. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తర్వాత వారిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. తెల్లవారాక రక్తపు మడుగులో ఉన్న దంపతులను చూసిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నందిగామ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, సీఐ చంద్రశేఖర్ తదితరులు మృతదేహాలను పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సుందర్రావు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
'నా ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదు'
సాక్షి, కృష్ణా: కరోనా పాజిటివ్ వచ్చిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం రోజున ఆయన మాట్లాడుతూ.. కరోనా పాజిటివ్ వచ్చిందని ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు. తనకు జూలై 26వ తేదీన కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు. తాను చాలా ధైర్యంగా ఉన్నానని, ప్రజలు ఎవరూ కూడా తన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పద్నాలుగు రోజుల హోం ఐసొలేషన్ తర్వాత కరోనా పరీక్ష చేయించడంతో నెగిటివ్‌గా నిర్దారణ అయిందన్నారు. త్వరలోనే మీ ముందుకు వస్తాను. కరోనా సోకితే భయపడాల్సిన అవసరం లేదని జాగ్రత్తగా ఉండి, భౌతిక దూరం పాటిస్తూ, ముఖానికి మాస్క్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా లక్షణాలు కనిపిస్తే దాచుకోకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కరోనా పరీక్షలు చేసుకున్న వ్యక్తులు రిపోర్టులు వచ్చేంత వరకు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని కోరారు. కరోనా పాజిటివ్ వచ్చి కోలుకున్న వ్యక్తులు వారి ప్లాస్మాని మరొకరికి దానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. (అగ్నిప్రమాదంలో సామినేని సన్నిహితుడు మృతి) -
జగ్గయ్యపేటలో అర్ధరాత్రి హైడ్రామా
-
పదేళ్లు సహజీవనం.. చివరకు రూ.50 వేల కోసం
సాక్షి, విజయవాడ : జగ్గయ్యపేటలో శనివారం జరిగిన ఓ ఘటన కలకలం రేపింది. పదేళ్లు సహజీవనం చేసిన ఓ మహిళ తన ప్రియుణ్ని దారుణంగా హత్య చేసింది. హత్యకు సహకరించిన తన కొడుకు, కూతురు, అల్లుడిని కేసు నుంచి తప్పించేందుకు దృశ్యం సినిమాను ఫాలో అయింది. చివరకు అడ్డంగా దొరికిపోవడంతో.. ఇంట్లో వంట చేసినంత సులువుగా.. ఎలా హత్య చేసింది పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చింది. వివరాలు.. కర్ణాటకకు చెందిన విజయకుమార్ బతుకుదెరువు కోసం పదేళ్ల క్రితం కృష్ణా జిల్లాకు వచ్చాడు. జగ్గయ్యపేట ధనంబోర్డులో మకాం పెట్టాడు. అదే ప్రాంతానికి చెందిన వివాహిత రాధపై మనసు పారేసుకున్నాడు. మొదటి భర్తకు దూరమై ఇద్దరు బిడ్డలతో కష్టాలు పడుతున్న రాధ విజయ్‌తో సహజీవనం చేయసాగింది. అతని సహకారంతో పిల్లల్ని పెద్దచేసింది. ఈక్రమంలో ఆమె కొడుకు ఇంటర్ పూర్తి చేసి ఓ మెకానిక్ షాప్‌లో పనిచేస్తుండగా.. కూతురికి వివాహమైంది. విజయ్ సంపాదనతో రాధ ఓ ఇల్లు కూడా కొనుగోలు చేసింది. అయితే, కొద్ది రోజుల క్రితం రాధ కూతురు, అల్లుడు విజయ్ వద్ద రూ.50 వేలు అప్పు తీసుకొన్నారు. వారు డబ్బు తిరిగి చెల్లించకపోవటంతో ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో శనివారం కూడా మరోమారు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దాంతో రాధ విజయ్‌ని గడ్డపలుగుతో కొట్టి దారుణంగా హత్య చేసింది. తన కూతురు, కొడుకు, అల్లుడిని కేసు నుంచి తప్పించడానికి మృతదేహంపై ఎక్కడా రక్తపు మరకలు, వేలిముద్రలు చిక్కకుండా ఇల్లంతా కడిగేసింది. చివరకు పోలీసుల విచారణలో రాధ నేరాన్ని అంగీకరింది. కూతురు, అల్లుడుపై విజయ్ దాడి చేస్తుంటే.. వాళ్ళని రక్షించేందుకు గడ్డపారతో కొట్టి చంపేశానని వెల్లడించింది. -
జగ్గయ్యపేటలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, కృష్ణా : జిల్లాలోని జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న ఓ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతులను తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా చెందిన నారపోగు గోపయ్య, షేక్ మన్సూర్, మట్టపల్లి భీంరెడ్డి, పోతుల భీం రెడ్డి ,విస్రం కోటేశ్వరరావు లుగా గుర్తించారు. మృతుల బంధువులకు ఏపీ పోలీసులు సమాచారం అందించారు. అయితే అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. -
జగ్గయ్యపేట ముంపు గ్రామాల్లో సామినేని పర్యటన
సాక్షి, కృష్ణా: కృష్ణా నది వరదల నేపథ్యంలో జగ్గయ్యపేట మండలంలో ముంపుకు గురైన రావిరాల, వేదాద్రి, ముక్త్యాల గ్రామాలలో ప్రభుత్వ విప్ సామనేని ఉదయభాను శనివారం పర్యటించారు. రావిరాల గ్రామంలో వరద బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ముంపుకు గురైన వరి, పత్తి, మొక్కజొన్న, మిరప పంటలను పరిశీలించారు. గ్రామాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేoద్రాలను, మెడికల్ క్యాంప్‌లను సందర్శించి అధికారులతో మాట్లాడారు. ఉదయభాను తన సొంత ఖర్చుతో వరద బాధితులకు అల్పాహారం, భోజనాలు ఏర్పాటు చేశారు. ఆయన కుమారులు వెంకట కృష్ణప్రసాద్, ప్రశాంత్ బాబులు సైతం ముంపు గ్రామాలను సందర్శించి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ వరదల వల్ల ఇళ్ళు కోల్పోయిన వారిని ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని తెలిపారు. వ్యవసాయశాఖ అధికారులతో విచారణ చేయించి పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ద్వారా సాయం అందిస్తామని ఉదయ భాను అన్నారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో సమీక్షించడం జరిగిందని, అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ నష్ట నివారణ చర్యలు చేపడుతున్నామని అన్నారు. ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. అలాగే వైయస్సార్ సీపీ పార్టీ శ్రేణులు వరద ముంపుకు గురైన గ్రామాలలోని ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని ఉదయభాను పిలుపునిచ్చారు. రావిరాలలో వరద ముంపు బాధితులకు వైఎస్సార్సీపీ శ్రేణులు పులిహోర పొట్లాలు పంపిణీ చేశాయి. -
జగ్గయ్యపేట ఎన్నికల ప్రచార సభలో వైఎస్ షర్మిల
-
‘కొడుకేమో పప్పు.. తండ్రేమో గన్నేరు పప్పు’
-
‘కొడుకేమో పప్పు.. తండ్రేమో గన్నేరు పప్పు’
సాక్షి, జగ్గయ్యపేట: ‘ బీజేపీతో నాలుగేళ్లు పొత్తు పెట్టుకుంది చంద్రబాబు. హరికృష్ణ మృతదేహాన్ని పక్కన పెట్టుకుని టీఆర్ఎస్తో పొత్తుకు వెంపర్లాడింది చంద్రబాబు. అలాంటి చంద్రబాబు వైఎస్సార్సీపీ మీద దుష్ప్రాచారం చేస్తున్నారు. మాకు ఏ పార్టీతో పొత్తు లేదు... ఆ అవసరం కూడా లేదు. సింహం సింగిల్‌గానే వస్తుంది. జగనమోహన్‌రెడ్డిగారు సింగిల్‌గానే బంపర్ మెజారిటీతో గెలుస్తారని సర్వేలన్నీ చెప్తున్నాయి. నక్కలే గుంపులుగా వస్తాయి. అందుకే చంద్రబాబు కాంగ్రెస్‌ను, జనసేనను, మమతా బెనర్జీని , కేజ్రీవాల్‌ను, దేవేగౌడ్‌ను, ఫరూక్ అబ్దుల్లాను తోడు తెచ్చుకున్నారు. చంద్రబాబు ఆయన కొడుకు లోకేశ్ కలిసి రాష్ట్రాన్ని లూఠీ చేశారు. కొడుకేమో పప్పు, తండ్రేమో గన్నేరు పప్పు అని అందరు అనుకుంటున్నారు. జగనన్నే కాబోయే ముఖ్యమంత్రి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార సభలో షర్మిల ప్రసంగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్థి పొట్లూరి ప్రసాద్‌ను, జగ్గయ్యపేట ఎమ్మెల్యే అభ్యర్థి సామినేని ఉదయభానును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వాగ్ధానాలు చేయడమే కాదు.. ఇచ్చిన మాటను మీద నిలబడే నైజం రాజన్న వంశానిదని షర్మిల అన్నారు. అవినీతి, అబద్దాలకు చంద్రబాబు మారుపేరు.. ఇంకా షర్మిల మాట్లాడుతూ.. ‘దివంగత మహానేత రాజశేఖరరెడ్డి గారు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ఐదేళ్లలో ప్రతి రైతు కుటుంబం ధైర్యంగా ఉండేది. ప్రతి పేద కుటుంబానికి భరోసా ఉండేది. ప్రతి మహిళకు నాకు అండ ఉందనే ధైర్యం ఉండేది. ప్రతి విద్యార్థికి నా చదవుకు డోకా లేదు ఉద్యోగం వస్తుందనే ధైర్యం ఉండేది. ప్రతి పేదవాడు కార్పొరేటు ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే ఆరోగ్య శ్రీ ఉండేది. ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో వచ్చే 108 ఉండేది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని శ్రమించాడు. ప్రతి పేదవాడికి ఇళ్లు ఇవ్వాలని ఆశపడ్డాడు. ఐదేళ్లలో ఒక్క రూపాయి ఏ చార్జీ పెంచకుండా.. ఏ పన్ను పెంచకుండా.. అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేసి సీఎం ఎలా ఉండాలో వైఎస్సార్ చూపించారు. కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా వైఎస్సార్ ప్రతి ఒక్కరికి మేలు చేశారు.ముఖ్యమంత్రి హోదాలో కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా మేలు చేసింది వైఎస్సార్ మాత్రమే. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటుకు, అబద్ధాలకు, అవినీతికి, అరాచకానికి మారుపేరు. రైతులకు, మహిళలను చంద్రబాబు దగా చేశారు. డ్వాక్రా మహిళను రుణమాఫీ పేరుతో మోసం చేశారు. డ్వాక్రా మహిళలకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. పసుపు-కుంకుమ పేరుతో చంద్రబాబు మళ్లీ మహిళలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పసుపు-కుంకుమ పేరిట చంద్రబాబు ఎంగిలి చేయి విదిలిస్తున్నారు. ఆ డబ్బులు వడ్డీకి కూడా సరిపోవు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారా?. ఫీజు రీయింబర్స్మెంట్ లేక తల్లిదండ్రులు ఫీజులు చెల్లించని స్థితిలో చాలామంది పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. ఆరోగ్య శ్రీ జాబితా నుంచి కార్పొరేటు ఆస్పత్రులను తొలగించారు. కానీ చంద్రబాబు నాయుడు కుటుంబం ప్రభుత్వ ఆస్పత్రికి కెళ్లి వైద్యం చేయించుకుంటుందా?. చంద్రబాబు మాట మీద నిలబడ్డారా? 16వేల కోట్ల రూపాయల అంచనా ఉన్న పోలవరాన్ని తన కమిషన్ల కోసం 60వేల కోట్లకు చంద్రబాబు పెంచారు. తన బినామీల కోసం కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తానే కడతానని తీసుకున్నారు. మూడేళ్లలో పోలవరం పూర్తి చేస్తానన్న చంద్రబాబు మాట మీద నిలబడ్డారా?. చంద్రబాబుకు మాట మీద నిలబడే నైజం లేదు. రాజధాని విషయంలో చాలా అనుభవం ఉంది.. హైదరాబాద్‌ను అంతా నేనే కట్టేశానని చంద్రబాబు చెప్పారు. రాజధాని గొప్పగా కబుర్లు చెప్పారు. కానీ ఒక్క శాశ్వత నిర్మాణం అయిన చేపట్టారా?. అబద్దపు ప్రచారం చేసుకోని చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ ప్రభుత్వం 2500 కోట్లు ఇచ్చామని చెబుతుంటే చంద్రబాబు రాజధానిలో చేసిందేమీ లేదు. ఆ డబ్బులు అన్ని ఎక్కడ ఉన్నట్టు?. ఆ డబ్బు చంద్రబాబు బొజ్జలో ఉన్నట్టు. అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానని అన్నట్టు ఉంది చంద్రబాబు తీరు. ఈ ఐదేళ్లలో అమరావతిలో ఒక శాశ్వత నిర్మాణం చేపట్టని చంద్రబాబు.. మళ్లీ అధికారం ఇస్తే అమెరికా చేస్తానని అంటున్నారు. శ్రీకాకుళంను హైదరాబాద్ చేస్తానని మన చెవుల్లో పూలు పెట్టారు. క్యాబేజీలు కూడా పెడతారట. ఎన్నికలయ్యాక చంద్రబాబు ఏం చేస్తారో.. బాబు వస్తే జాబు వస్తుందన్నారు. కానీ చంద్రబాబు గారి కుమారుడు లోకేశ్‌కు మాత్రమే జాబు వచ్చింది. ఏకంగా లోకేశ్‌కు మూడు మంత్రి పదవులు ఇచ్చారు. ఆయన తెలివిమంతుడు అనుకుంటే.. ఈ లోకేశ్‌కు జయంతికి, వర్ధంతికి తేడా తెలియదు. అ,ఆలు కూడా రావు కానీ అగ్రతాంబులం నాకే అన్నట్టు ఉంది. ఒక్క ఎన్నిక కూడా గెలవకుండానే లోకేశ్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు. చంద్రబాబుది పుత్ర వాత్సల్యం కాదా?. ఇప్పుడు చంద్రబాబు మీ భవిష్యత్తు నా భాద్యత అని అంటున్నారు. గత ఐదేళ్లుగా ప్రజల భవిష్యత్తు చంద్రబాబు బాధ్యత కాదా?. చంద్రబాబు కొడుక్కు మూడు ఉద్యోగాలు.. మాములు యువతకు ఉద్యోగాలు లేవు, నోటిఫికేషనులు లేవు. ఈ ఐదేళ్లు లోకేశ్ కోసమే చంద్రబాబు పనిచేశారు. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఎంతో అవసరం. హోదా లేకుంటే ఉద్యోగాలు రావు, పరిశ్రమలు రావు. ప్రత్యేక హోదా ఏపీకి ఊపిరి. గత ఎన్నికలప్పుడు 15 ఏళ్లు ప్రత్యేక హోదా అడిగిన చంద్రబాబు సీఎం అయ్యాక బీజేపీతో కలిసి హోదాను తాకట్టు పెట్టారు. అప్పుడు కమిషన్ల కోసం ఆశపడ్డారు. మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి ప్రత్యేక హోదా అని నమ్మబలుకుతున్నారు. మళ్లీ ఎన్నికలయ్యాక ఏం చేస్తారో?. చంద్రబాబు గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.. ఇప్పుడు కాంగ్రెస్‌తో కలిసి వస్తున్నారు. చంద్రబాబుకు రెండు నాలుకలు ఉంటాయి కాబట్టే రెండు వేళ్లు చూపెడుతు ఉంటారు. ఎవరికైనా టీడీపీ వాళ్లు రెండు వేళ్లు చూపెడితే మీకు రెండు నాలుకలు ఉన్నాయి నిజమేనని చెప్పాలి. అందుకే చంద్రబాబు నిజాలు మాట్లాడారు.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం బతికి ఉందంటే అది కేవలం వైఎస్ జగన వల్లనే. హోదా కోసం ఢిల్లీ వేదికగా వైఎస్ జగన్ ధర్నాలు, దీక్షలు చేశారు. రాష్ట్రంలో రోజుల తరబడి నిరహార దీక్షలు చేపట్టారు. బంద్‌లు చేశారు, యువభేరీలుపెట్టారు. అఖరికి వైఎస్సార్ సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి త్యాగం చేశారు.ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ ఊరురా తిరిగి హోదా కోసం పోరాడకపోతే.. ఈ రోజు చంద్రబాబు యూ టర్న్ తీసుకునేవారా?. చంద్రబాబు నోట హోదా మాట వచ్చేదా?. కానీ చంద్రబాబు గారు నిజం చెప్పరు. ఎందుకంటే నాన్నగారు చెప్పారు.. చంద్రబాబు నెత్తి మీద శాపం ఉందంటా. ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెబితే, ఆ రోజు చంద్రబాబు గారి తలకాయ వెయ్యి ముక్కలు అవుతుందటా. అందుకే ఆయన ఎప్పుడు నిజాలు మాట్లాడారు. చంద్రబాబు దగ్గర పనిచేసిన సీఎస్ అజేయ కల్లెం.. ఈ ఐదేళ్లలో గత 40 ఏళ్లలో చేయని అప్పు చేశారని చెబుతున్నారు. కొడుకు, తండ్రి కలిసి రాష్ట్రాన్ని నాశనం చేశారు. మన భవిష్యత్తును వీళ్ల చేతుల్లో పెడితే నాశనం చేస్తారు. నారారూప రాక్షసులు వీళ్లు. ప్రత్యేక హోదా విషయంలో, రాజధాని కట్టే విషయంలో, వ్యవసాయ ఉత్పత్తి పెంచే విషయంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపే విషయంలో ఇలా అన్నిటా చంద్రబాబు విఫలమయ్యారు. జగనన్న ఈ తొమ్మిదేళ్లు నీతివంతమైన రాజకీయాలు చేశారు. పాదయాత్ర 3,648 కి.మీ చేశారు. ప్రజ సమస్యలను దగ్గరగా చూశారు. ప్రతి సమస్యల్లో ప్రజల పక్షాన నిలిచారు. ఇతర పార్టీ నుంచి గెలిచిన వారిని తమ పార్టీలో చేర్చుకుని చంద్రబాబులా జగనన్న రాజకీయ వ్యభిచారం చేయలేదు. అధికారం కోసం నిలబెట్టుకోలేని హామీలను జగనన్న ఎప్పుడు ఇవ్వలేదు. పిల్లనిచ్చిన మామ దగ్గరికే తీస్తే ఆయన పార్టీని చంద్రబాబు కబ్జా చేశారు. ఈ ఎన్నికలు మంచికి, చేడుకి మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఓదార్పు యాత్ర పేరిట ఇచ్చిన మాట కోసం మంత్రి పదవిని సైతం జగనన్న వద్దన్నారు. దివంగత మహానేత చనిపోతే 700 మందికి పైగా బాధతో మరణించారు. ఈ అవినీతి పాలన పోవాలంటే, రాజన్న రాజ్యం రావాలన్నా, వ్యవసాయం పండగ కావాలంటే, మాట తప్పనివాడు కావాలంటే, మడమతిప్పని వాడు కావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా సేవ చేయాలని వైఎస్ జగన్ ఆశపడుతున్నారు. ఒక్క అవకాశం ఇవ్వమని అడుగుతున్నాం. జగనన్న ముఖ్యమంత్రి అయితే రైతన్న తలెత్తుకునేలా చేస్తాం. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి రైతన్నకు పెట్టుబడి సాయంగా మే నెలలోనే రూ. 12, 500 అందిస్తారు. గిట్టుబాటు ధర కోసం 3వేల కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేస్తారు. కరువులు, ప్రకృతి విపత్తులు వస్తే రైతులు ఎదర్కొవడానికి 4వేల కోట్ల రూపాయలతో మరో నిధిని ఏర్పాటు చేస్తారు.కరువులు వచ్చినప్పుడు రైతులు నష్టపోకుండా నాలుగు వేల కోట్లతో నిధి ఏర్పాటు చేస్తాం. అగ్రిగోల్డ్ బాధితులకు తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామ’ని తెలిపారు. -
ఓటమి భయంతోనే టీడీపీ కుట్ర
సాక్షి, ఇందుగపల్లి(వత్సవాయి) : గతంలో ఎన్నడూ లేని విధంగా ఓట్ల ప్రక్రియ గందరగోళంగా మారింది. వాస్తవంగా ఒక వ్యక్తికి రెండు ప్రాంతాల్లో ఓట్లు కలిగి ఉంటే ఒక ప్రాంతంలో తొలగించాలని ఫారం–7 కింద దరఖాస్తులు చేసుకోవాలి కానీ మండలంలోని పలు గ్రామాల్లో దీనికి విరుద్దంగా జరుగుతుంది. గ్రామాల్లో నివాసం ఉండే వారికి కూడా ఓటు తొలగించాలని అధికారులకు దరఖాస్తులు అందిస్తున్నారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరులైన వారి ఓట్లు తొలగించాలని దరఖాస్తులు అందాయి. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబునాయుడు కల్లిబొల్లి మాటలను నమ్మి ఓట్లు వేసిన ప్రజలు ఆ తరువాత హామీలను అమలుచేయకపోవడంతోతీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వైఎస్సార్ సీపీ ఓట్లపైనే కుట్ర.... వైఎస్సార్ సీపీ పట్ల ప్రజలు నమ్మకంతో ఆ పార్టీకి అనుకూలంగా ఉండడంతో మరలా ఎలాగైనా అ«ధికారాన్ని దక్కించుకోవాలనే దుర్భద్దితో ఓట్ల తొలగింపుకు శ్రీకారం చుట్టారు. పైగా వైఎస్సార్ సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, బూత్ కన్వీనర్ల పేరుతో ఆన్లైన్లో దరఖాస్తులు చేస్తున్నారు. గ్రామాల్లో బీఎల్వోలు తొలగింపులు జాబితాలు తీసుకుని సదరు ఓటు తొలగింపుకు ఎంపికైన వ్యక్తికి ఇంటికి వెళ్లి రశీదులు అందిస్తున్నారు. దీంతో కొందరు ఓటర్లు కంగుతింటున్నారు. మేము గ్రామంలోనే నివాసం ఉంటున్నామని మా ఓటు ఎందుకు తొలగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు మా ఓటు తొలగించాలని ఎవరు దరఖాస్తులు పెట్టారు అని అడిగినా సమాధానం చెప్పలేని పరిస్థితిలో బీఎల్వోలు ఉన్నారు. రెవెన్యూ కార్యాలయంలో అడిగినా మాకు తెలియదు మీబీఎల్వోలను అడగండి అని సమాధానం తప్ప మరొకటి లేదు. ఇందుగపల్లి పంచాయతీ పరిధిలో... ఇందుగపల్లి గ్రామంలో 20 ఓట్లు తొలగించాలని వైఎస్సార్ సీపీకి చెందిన గ్రామ నాయకులు వాసిరెడ్డి నాగేశ్వరరావు, కిలారు హనుమయ్య పేరుతో ఫారం – 7 కింద దరఖాస్తులను ఆన్లైన్లో దరఖాస్తులు చేశారు. వాటిలో ఎక్కువగా వైఎస్సార్ సీపీకి చెందిన ఓట్లే ఉన్నాయి. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను తీసుకుని హనుమయ్య ఇంటికి బీఎల్వోలు వెళ్లగా ఆయన నిర్ఘాంతపోయారు. మా కార్యకర్తల ఓట్లు తొలగించమని నేను దరఖాస్తులు అందించడం ఏమిటి అని అడగ్గా మాకు తెలియదు ఆన్లైన్లో మీ పేరుమీద దరఖాస్తులు అందాయి అని చెప్పడంతో ఇదంతా టీడీపీ నాయకుల కుట్ర అని మా కార్యకర్తలు అందరూ గ్రామంలోనే ఉన్నారు అని చెప్పారు. వైఎస్సార్ సీపీపై నిందవేసేందుకే వైఎస్సార్ సీపీపై నిందవేసేందుకే ఆన్లైన్లో కొందరు పనిగట్టుకుని ఫారం – 7 లను అందిస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడడంతో టీడీపీ నాయకుల కుట్రలకు అంతులేకుండా పోతుంది. సరైన సమయంలో వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. నేను వైఎస్సార్ సీపీలో ఉత్సాహంగా పనిచేస్తున్నందుకు నాపేరు పెట్టారు. -చావా కృష్ణారావు గ్రామస్తుడు ప్రజలు నమ్మిన వారికే ఓటేస్తారు రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఇద్దరు పోటీపడితే ఒక్కరే గెలుస్తారు ప్రజలు ఎవరిని నిమ్మితే వారికే ఓట్లు వేసి గెలిపిçస్తారు. అలా కాకుండా గ్రామాల్లో నివాసం ఉండే వారి ఓట్లు తొలగించి గెలవాలనుకోవడం విడ్డూరం. ఈ విధంగా చేయడం వల్ల గ్రామాల్లో వివాదాలు తలెత్తుతాయి. నేను గ్రామంలోనే ఉంటున్నా నాపేరును తొలగించేందుకు దరఖాస్తు అందించారు. -గంధసిరి త్రివేణి విద్యార్థిని -
ప్రాణాలు తీసిన సెల్ఫీ
జగ్గయ్యపేట: రైలుబండి మీద సెల్ఫీ దిగాలన్న సరదా ఓ విద్యార్థి ప్రాణాలు తీసింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని తొర్రకుంట పాలేనికి చెందిన పగడాల రామసాయి(15) పట్టణంలోని ఓ స్కూల్లో ఈ ఏడాది పదో తరగతి పూర్తిచేశాడు. ఇటీవల వెలువడిన ఫలితాల్లో 9.6 పాయింట్లు సాధించాడు. అయితే బుధవారం మధ్యాహ్నం సమీపంలోని గూడ్సు రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ స్నేహితులతో ఆటలాడిన తర్వాత గూడ్సు రైలెక్కి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో 70 శాతానికి పైగా కాలిపోయి రైలుమీదే కుప్పకూలిపోయాడు. విద్యార్థిని 108 ద్వారా జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గొల్లపూడి ఆంధ్రా ఆస్పత్రికి, అక్కడ నుంచి గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు
జగ్గయ్యపేట: అనంతపురంలో సాక్షి పత్రిక కార్యాలయం వద్ద తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన తండ్రిని అసభ్య పదజాలంతో టీడీపీ ఎమ్మెల్యే జె.సి.ప్రభాకర్‌రెడ్డి దూషించాడు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కృష్ణాజిల్లా జగ్గయ్యపేట పట్టణ పోలీస్ స్టేషన్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను ఆదివారం ఫిర్యాదు చేశారు. ప్రభాకర్‌రెడ్డి దూషించిన వీడియో క్లిప్పింగ్‌ల సీడీలను ఎస్ఐ వి.వి.రావుకు అందజేశారు. అనంతరం స్థానిక ఆర్ అండ్ బీ వసతి గృహంలో ఉదయభాను విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏపీ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ను డిమాండ్ చేశారు. ప్రభాకర్‌రెడ్డి వీధి రౌడీలా ప్రవర్తించారన్నారు. జేసీ సోదరులకు చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సు పెనుగంచిప్రోలు మండలం, ముండ్లపాడు వద్ద ప్రమాదానికి గురై 10 మంది మృతి చెందారని, బాధితులను పరామర్శించేందుకు వచ్చిన జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రభాకర్‌రెడ్డి అవివేకానికి నిదర్శనమన్నారు. -
జగ్గయ్య పేటలో YSRCP నేత సామినేని అరెస్ట్