Garikapadu check post
-
కారులో భారీగా నగదు పట్టివేత
సాక్షి, కృష్ణా : జిల్లాలోని గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద హవాలా డబ్బు కలకలం రేపింది. వాహనాలు తనిఖీలు చేపట్టిన పోలీసులకు.. ఓ కారులో భారీ మొత్తంలో నగదు గుర్తించారు. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.80 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హవాలా డబ్బును సికింద్రాబాద్ నుంచి కోల్‌కతాకు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. గోల్డ్ వ్యాపారి మహ్మద్ భాషాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పట్టుబడ్డ నగదును ఐటీ అధికారులకు అప్పగించారు. హవాలా రాకెట్ అసలు సూత్రదారులకోసం అరా తీస్తున్నారు. (చదవండి : ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ స్వాధీనం) -
కృష్ణా: గరికపాడు చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు
-
అపోహలకు చెక్ పెట్టిన ఏపీ సర్కార్
సాక్షి, గరికపాడు : లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి, చదువుల కోసం ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లిన వారు తిరిగి సొంతూళ్లకు చేరుకుంటున్నారు. దీంతో అధికారులూ అప్రమత్తమవుతున్నారు.. వీరందరినీ క్వారంటైన్లకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఆంధప్రదేశ్ ప్రభుత్వం అపోహలకు చెక్ పెట్టింది. కృష్ణాజిల్లా గరికపాడు చెక్‌పోస్ట్ సరిహద్దులో స్పందన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. (24 శ్రామిక్ రైళ్లలో 27,458 మంది తరలింపు) ఇందులో భాగంగా రాష్ట్ర సరిహద్దు గరికపాడు చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేసిన (మైగ్రేషన్ యాప్) స్పందన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సెంటర్‌ను కలెక్టర్ ఇంతియాజ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా నుంచి రాష్ట్రానికి వచ్చే వారి వివరాలను మైగ్రేషన్ యాప్‌లో పొందుపరుస్తారన్నారు. ఆధార్ వివరాలతో పాటు వ్యక్తికి సంబంధించిన వివరాలను నమోదు చేస్తారన్నారు. వైద్య సిబ్బందితో ధర్మల్ స్కానింగ్ చేసి కరోనా వైరస్ లక్షణాలుంటే క్వారంటైన్ సెంటరుకు లేని వారికి స్టాంప్ వేసి హోం క్వారంటైన్లో ఉండాలని సూచించి పంపటం జరుగుతుందన్నారు. (జాగ్రత్తలు పాటిస్తూ తిరిగి కార్యకలాపాలు: సీఎం జగన్) స్క్రీనింగ్ టెస్ట్ తరువాత వైద్య బృంధం క్లీన్ చిట్ ఇచ్చినా హోం క్వారంటైన్లో ఉండాలన్నారు. రెండు రాష్ట్రాల అధికారులు ఇచ్చిన పాస్‌లున్న వారిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరు ఆరోగ్య సేతు యాప్ వినియోగించాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఇబ్బందులు పడకుండా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా వలస కూలీలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. భద్రతను కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ నుంచి వస్తున్న ఉత్తరప్రదేశ్ వలస కూలీలతో మాట్లాడి సూచనలు చేశారు. (సీఎస్ చొరవతో స్వస్థలాలకు..) -
ఏపీ-తెలంగాణ బోర్డర్లో భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్-తెలంగాణ బోర్డర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఏపీ నుంచి వెళ్లే వాహనాలను తెలంగాణ అధికారులు, తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే వాహనాలను ఏపీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో గరికపాడు చెక్‌పోస్టు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో అక్కడ విధులు నిర్వరిస్తున్న సిబ్బంది.. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ క్రమంలో కలెక్టర్ల జోక్యంతో సమస్య పరిష్కారమైంది. దీంతో ఇరువైపుల సరైన పత్రాలు కలిగిన వాహనాల ప్రయాణానికి అనుమతించారు. మరోవైపు వలస కూలీలు ప్రయాణిస్తున్న నాలుగు బస్సులను మాత్రం పునరావాసానికి తరలించారు. వారి ప్రయాణానికి అనుమతి వచ్చాక పంపుతామని చెక్‌పోస్ట్ సిబ్బంది తెలిపారు. చదవండి : ‘చిన్న తరహా పరిశ్రమలకు అనుమతి ఇచ్చాం’ కరోనా యోధులకు గౌరవ వందనం -
అతివేగానికి ఐదు ప్రాణాలు బలి
జగ్గయ్యపేట(కృష్ణాజిల్లా) : నిద్రమత్తు, అతివేగం ఐదు ప్రాణాలను బలితీసుకున్నాయి. సెలవు రోజు దర్గమ్మను దర్శించుకుందామని హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరిన వారు కారు ప్రమాదంలో అనంతలోకాలకు చేరుకున్నారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు గ్రామంలోని 65వ నంబరు జాతీయ రహదారిపై ఆర్టీఐ చెక్‌పోస్టు వద్ద ఆదివారం ఉదయం జరిగిన ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌కు చెందిన షేక్ మున్సూర్ (24), మహబూబ్‌నగర్‌కు చెందిన మఠంపల్లి భీమిరెడ్డి (27), హైదరాబాద్ పటేల్‌నగర్‌కు చెందిన విక్రం కోటేశ్వరరావు (24), కర్ణాటకలోని ఖేదంగోల్కొండకు చెందిన పోతుల భీమిరెడ్డి (25) స్నేహితులు. కర్ణాటకకు చెందిన పోతుల భీమిరెడ్డి కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇందులో ఇద్దరు ఏసీ మెకానిక్‌లు కాగా ఒకరు బైక్ మెకానిక్, మరొకరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. వీరంతా ఆదివారం సెలవు దినం కావటంతో దుర్గమ్మ దర్శనానికి విజయవాడకు బయలుదేరారు. శనివారం అర్థరాత్రి అదే ప్రాంతానికి చెందిన కారును అద్దెకు తీసుకుని డ్రైవర్ సహా ఐదుగురు బయలుదేరారు. మార్గమధ్యంలో ఆపుకుంటూ సెల్ఫీలు దిగుతూ ఆడుతూ పాడుతూ ప్రయాణిస్తున్నారు. ఆర్టీఐ చెక్‌పోస్టు సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్దకు వచ్చే సరికి కారు వేగంగా వెళ్తూ ఒక్కసారిగా డివైడర్‌ను ఢీకొట్టి 10 అడుగుల ఎత్తు ఉన్న మొక్కలను చీల్చుకుంటూ వెళ్లి రోడ్డుపై పల్టీలు కొట్టి ఆగింది. అదే సమయంలో జగ్గయ్యపేట నుంచి హైదరాబాద్ వెళ్తున్న మరో కారు వేగంగా వచ్చి దీన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో ఖమ్మం జిల్లా నాగులవంచకు చెందిన డ్రైవర్ నారపోగు గోపయ్య (22), పక్కనే కూర్చున్న షేక్ మున్సూర్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీట్లో కూర్చున్న పోతుల భీమిరెడ్డి, మఠంపల్లి భీమిరెడ్డి, విక్రం కోటేశ్వరరావును జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరు భీమిరెడ్డిలు మార్గమధ్యంలో మృతి చెందగా విజయవాడ ఆంధ్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోటేశ్వరరావు మృతి చెందాడు. అతి వేగం, నిద్రమత్తు ప్రమాదానికి కారణమని నందిగామ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
జగ్గయ్యపేటలో ఘోర రోడ్డు ప్రమాదం
-
జగ్గయ్యపేటలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, కృష్ణా : జిల్లాలోని జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న ఓ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతులను తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా చెందిన నారపోగు గోపయ్య, షేక్ మన్సూర్, మట్టపల్లి భీంరెడ్డి, పోతుల భీం రెడ్డి ,విస్రం కోటేశ్వరరావు లుగా గుర్తించారు. మృతుల బంధువులకు ఏపీ పోలీసులు సమాచారం అందించారు. అయితే అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. -
ఒక్క గరికపాడు చెక్‌పోస్టు నుంచే రూ.1.30 కోట్లు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ వాహనాలకు శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రవేశ పన్ను విధించడంతో తొలి రోజు ఆదాయం రూ.1.50 కోట్లకు చేరింది. ఇందులో కృష్ణా జిల్లా సరిహద్దులోని గరికపాడు చెక్‌పోస్టు ఆదాయం రూ.1.30 కోట్ల వరకు ఉంది. త్రైమాసిక పన్ను కింద వంద ప్రైవేటు బస్సులు ట్యాక్స్ చెల్లించడంతో ఈ ఆదాయం రూ.1.20 కోట్ల వరకు ఉందని రవాణా వర్గాలు పేర్కొంటున్నాయి. లారీలు ఏడు, 30 రోజుల పన్ను చెల్లించగా, ట్యాక్సీలు, ప్రయాణీకులు చేరవేసే మ్యాక్సీ క్యాబ్‌ల ఆదాయం మొత్తం కలిపి రూ.30 లక్షల వరకు ఉందని అధికారులు చెబుతున్నారు. క్వార్టర్లీ ట్యాక్స్ చెల్లించిన వంద ప్రైవేటు బస్సులు మరో మూడు నెలల వరకు పన్ను చెల్లించనక్కర్లేదు. గుంటూరు సరిహద్దులోని మాచర్ల, దాచేపల్లి వద్ద ఉన్న చెక్‌పోస్టుల ద్వారా రూ.5 లక్షలు, కృష్ణా-ఖమ్మం జిల్లా సరిహద్దులో ఉన్న తిరువూరు చెక్‌పోస్టు నుంచి రూ.2 లక్షలు, కర్నూలు జిల్లా పంచలింగాల వద్ద ఉన్న చెక్‌పోస్టు ద్వారా రూ.3 లక్షలు, ఉభయగోదావరి జిల్లాల సరిహద్దులో ఉన్న చెక్‌పోస్టుల ద్వారా సుమారు రూ.పది లక్షల వరకు రాబడి వచ్చినట్లు రవాణా వర్గాలు తెలిపాయి.