
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కర్నూల్ : జిల్లాలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన కన్న కొడుకును చూసేందుకు ఎంతో ఆతృతతో సంతోషంతో బయలుదేరిన ఓ వ్యక్తి.. అంతలోనే కడతేరాడు. రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. కర్నూల్‌లోని శ్రీరామ థియేటర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
సీబెలగల్ మండలం కొండాపురానికి చెందిన సుధాకర్ భార్య కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. భార్య, బిడ్డను చూసేందుకు బైక్ మీద సుధాకర్ బయలుదేరాడు. శ్రీరామ థియేటర్ ఎదుట అతని బైకును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో భార్య, అప్పుడు పుట్టిన కొడుకును చూడకుండానే సుధాకర్ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన చూసి స్థానికులు కంటతడి పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment